You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇండోనేసియా: సునామీ హెచ్చరిక వ్యవస్థ నమ్మదగినదేనా?
ఇటీవల (2018 అక్టోబర్) ఇండోనేసియాలో సంభవించిన సునామీ కారణంగా వందలాది మంది చనిపోయారు. భారీగా విధ్వంసం జరిగింది.
అయితే, ఇలాంటి విపత్తును నివారించగలమా? హెచ్చరిక వ్యవస్థలపై ఎంతవరకూ ఆధారపడవచ్చు? ఇతర దేశాల్లో సునామీ హెచ్చరిక వ్యవస్థలతో పోల్చితే ఇండోనేసియాలోని సునామీ హెచ్చరిక వ్యవస్థ ఎలా పనిచేస్తోంది? ఈ అంశాలను ఒకసారి పరిశీలిద్దాం.
పాలులో సంభవించిన నష్టం తర్వాత ఇండోనేసియాతీరంలోని సునామీ హెచ్చరిక వ్యవస్థ పూర్తిగా విఫలమైందని అర్థమైంది. వాస్తవానికి 2004లో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ తర్వాతే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల తీరాల్లోనూ సునామీ హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేశారు.
అంతర్జాతీయ సహకారంతో ఇండోనేసియాలోనూ సునామీని పసిగట్టే వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనికి దాదాపు రూ.746 కోట్లు ఖర్చు అయింది. అయితే, ఈ వ్యవస్థకు సంబంధించి సముద్రంలో ఉంచిన కీలక పరికరాలు తరచూ అపహరణకు గురయ్యాయి.
2018 నాటికి పాలు తీరంలో ఒక్క పరికరం కూడా లేకుండా పోయింది. అలాగే ఈ తీరంలో భూకంపాన్ని పసిగట్టే వ్యవస్థ ఉన్నప్పటికీ విద్యుత్ కోతల కారణంగా హెచ్చరికలను జారీ చేయలేకపోయింది.
అయితే, అమెరికా, జపాన్‌లు అత్యాధునిక పరికరాలు, సెన్సర్లతో సునామీ హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. జపాన్ అయితే తమ ప్రజల్లో సునామీకి సంబంధించి ఎన్నో రకాలుగా అవగాహన కల్పిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేసే ఏ వ్యవస్థలోనైనా లోపాలు ఉండటం సహజం. కానీ జపాన్ ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ చాలావరకూ ప్రభావవంతంగా పనిచేస్తోంది.
ఇవి కూడా చదవండి
- బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్: గ్రామాలను ముంచేసిన బురద.. ప్రజల్ని ఆదుకోలేకపోతున్న ప్రభుత్వం
- ఇండోనేసియా: సునామీ హెచ్చరిక వ్యవస్థ ఎందుకు విఫలమైంది?
- ఇండోనేసియా సునామీ: ''అమ్మ ఎక్కడుంది? అమ్మ ఎక్కడికి వెళ్లింది? అని పాప అడుగుతోంది''
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- భార్యపై భర్త రేప్ గురించి ఎందుకింత గొడవ
- హిమాలయన్ వయాగ్రా: కిలో రూ.70 లక్షలకు కొంటున్నారు
- 'భవిష్యత్తు ఉండాలంటే నిర్మాతలతో, దర్శకులతో పడుకోక తప్పదన్నారు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)