భర్త వేధింపులకు సంప్రదాయ ‘కట్టె’డి

ఇథియోపియాలోని ఓరోమో సంప్రదాయాలను, సంస్కృతిని పాటించే మహిళలను ఒక చిన్న కట్టె గృహహింస నుంచి కాపాడుతోంది.

‘సినిగె’గా పిలిచే ఒక మాదిరి కట్టె వీరి సంస్కృతిలో భాగం. పెళ్లికాగానే మహిళలకు ‘సినిగె’ను ఇస్తారు. దీన్నికుటుంబంలోని మహిళల రక్షణకు సంకేతంగా భావిస్తారు.

ఓరోమో సంస్కృతి నిపుణురాలు సారా దూబే దీనిపై మాట్లాడుతూ, ఇక్కడి సంప్రదాయ చట్టాల ప్రకారం మహిళలను కించపర్చడం, వేధించడం, కొట్టడం నేరంగా పరిగణిస్తారని చెప్పారు.

ఓరోమో ప్రజల ప్రాచీన పరిపాలన వ్యవస్థ 'గదా'లో 'సినిగె' ఒక భాగం. 'గదా' వ్యవస్థ ఆరంభమైనప్పుడు శత్రువులను వేటాడేందుకు పురుషులకు ఆయుధాలిచ్చారు. తమ హక్కులు కాపాడుకునేందుకు మహిళలకు 'సినిగె'ను ఇచ్చారు. ముందు తరాలు ఈ సంప్రదాయం కొనసాగించాలని పెద్దవాళ్లు కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)