బతకడని అవయవదానానికి సిద్ధమయ్యారు.. తర్వాత ‘‘అద్భుతం’’ జరిగింది
మరణ శయ్యపై ఉన్న తమ 13 ఏళ్ల కొడుకు బతకడని అవయవ దానానికి సిద్ధమైన తల్లిదండ్రులు అన్ని పేపర్లపై సంతకం చేశారు. కానీ ఆక్సిజన్ ఆపివేసే ముందు ఆ బాలుడు స్పృహలోకి వచ్చాడు.
ట్రెంటన్ మెక్ కిన్లే అనే బాలుడు అమెరికాలోని అలబామా రాష్ట్రంలో మార్చిలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు.
కారు ట్రైలర్ నుంచి తలకిందులుగా పడడంతో అతడి తల నేలను గుద్దుకుంది. తలకు ఏడు ప్రాక్చర్స్ అయ్యాయి. మెదడు తీవ్రంగా దెబ్బతింది.
డాక్టర్లు అతడు ఇక కోలుకోలేడని తల్లిదండ్రులకు చెప్పేశారు. బాలుడి అవయవాలతో ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరమైన మరో ఐదుగురు పిల్లలకు కొత్త జీవితం ఇవ్వచ్చన్నారు.
అతడి లైఫ్ సపోర్ట్ తీసేయడానికి ఒక రోజు ముందు.. ట్రెంటన్ తను స్పృహలోనే ఉన్నట్టు సంకేతాలు చూపించాడు.
ఇది "ఒక అద్భుతం" అని ట్రెంటన్ తల్లి రిండిల్ అంటారు.
స్పృహలో లేనప్పుడు తనకు స్వర్గంలో ఉన్నట్టు అనిపించిందని ట్రెంటన్ చెప్పాడు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)