చైనా వర్సెస్ అమెరికా: 40 యుద్ధ విమానాలు, అతి పెద్ద యుద్ధ నౌకలు సిద్ధం చేసిన చైనా

వీడియో క్యాప్షన్, చైనా ఇప్పటికే అక్కడికి అతి పెద్ద యుద్ధ నౌకల సమూహాన్ని పంపించింది.

దక్షిణ చైనా సముద్రం పై ఆధిపత్యం కోసం వివిధ దేశాల మధ్య పోటీ వేడెక్కింది. చైనా ఇప్పటికే అక్కడికి అతి పెద్ద యుద్ధ నౌకల సమూహాన్ని పంపించింది. అమెరికా కూడా ఒక భారీ విమాన వాహక నౌకను కూడా ఈ సముద్ర జలాలలోకి పంపించింది. అయితే అమెరికా తన పరిధిలో లేని సముద్ర జలాల్లోకి అక్రమంగా చొరబడిందని చైనా విమర్శిస్తోంది. భారీ సైనిక స్థావరాల ఏర్పాటుతో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆమెరికా ఆరోపిస్తోంది.

చైనా దాదాపు నలభై యుద్ధ విమానాలను ఈ సముద్రానికి పంపించినట్టుగా మార్చి నెల చివర్లో తీసిన ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి. వీటి మధ్యలో కనిపిస్తున్నది భారీ విమానవాహక నౌక అని స్పష్టంగా తెలుస్తోంది. దీని పేరు లియావొనింగ్, చైనా తయారు చేసిన మొదటి ఆపరేషనల్ క్యారియర్.

దక్షిణ చైనా సముద్రంలోకి మున్నెన్నడూ ఇంత భారీ నౌకల సమూహాన్ని చైనా పంపించలేదు. ఇది నిజానికి, పెరుగుతున్న చైనా నౌకాదళ సామర్థ్య ప్రదర్శన అనే చెప్పాలి.

అయితే, అమెరికా నౌకాదళ శక్తి సామర్థ్యాలను నేరుగా సవాల్ చేయాలంటే చైనాకు ఇంకా చాలా కాలం పడుతుంది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)