You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
క్షిపణి హెచ్చరికలతో అమెరికాలో హడావుడి
అమెరికాలో ఆదివారం నిద్రలేచే సరికి క్షిపణి మీవైపు దూసుకొస్తోందంటూ ఫోన్లకు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో అంతా ఉరుకులు.. పరుగులు.
ఓ క్షిపణి మీ వైపు దూసుకువస్తోంది. వెంటనే వెళ్లి సురక్షిత ప్రాంతంలో తలదాచుకోండి. అంటూ మొబైల్‌కి వచ్చిన అలెర్ట్ అమెరికాలోని హవాయి రాష్ర్ట ప్రజలను ఆందోళనకు గురి చేసింది.
శనివారం ఇక్కడ మొబైల్ వినియోగదారులకు ఈ మెసేజ్ వచ్చింది. ‘ క్షిపణి దూసుకొస్తోంది. తలదాచుకోండి. ఇది ‘డ్రిల్’ కాదు..’ అని ఆ సందేశం పేర్కొంది.
అయితే తర్వాత ఇది తప్పుడు హెచ్చరికని తేలింది.
ఇక్కడి గవర్నర్ డేవిడ్ ఇగే ఈ ఘటనపై క్షమాపణలు చెప్పారు.
ఓ ఉద్యోగి తప్పుడు బటన్ నొక్కడం వల్ల ఈ హెచ్చరిక వచ్చిందని తెలిపారు.
ఈ అంశంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని అమెరికా ప్రభుత్వం తెలిపింది.
హవాయి రాష్ర్టం ఉత్తర కొరియా క్షిపణుల పరిధిలో ఉండటంతో ఈ హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేశారు.
2017 డిసెంబరులో ఇక్కడ అణు బాంబు హెచ్చరిక సైరెన్‌ను కూడా పరీక్షించింది.
ఈ అలెర్ట్ ఎలా వచ్చింది?
ఈ తప్పుడు సందేశం ఫోన్లతో పాటు.. స్థానిక టీవీలు, రేడియోల్లోనూ పెద్ద ఎత్తున ప్రసారమైంది.
శనివారం ఉదయం 8.07 గంటల సమయంలో ఫోన్లకు ఈ హెచ్చరిక వచ్చింది.
ఇక్కడి స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీలో ఉద్యోగులు డ్యూటీ మారినపుడు రోజుకు మూడు సార్లు ఈ హెచ్చరిక వ్యవస్థను పరీక్షిస్తారు. అయితే ఈ సారి ఈ పరీక్ష సందర్భంగా అది మిస్ ఫైర్ అయింది. అని గవర్నర్ తెలిపారు.
ఈ సందేశం వచ్చాక ప్రజలు ఎలా భయ భ్రాంతులకు గురయ్యారో.. ఇళ్లలోకి ఎలా పరుగులు తీశారో స్థానిక చానెళ్లు చూపించాయి.
మరోవైపు జనవరి 5న జపాన్‌లో తప్పుడు భూకంప హెచ్చరికల అక్కడివారిని భయభ్రాంతులకు గురి చేసింది.
ఇవి కూడా చూడండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)