అమెజాన్ కీ సాయంతో ఇంట్లో ఎవరూ లేకున్నా డెలివరీ
ఇంట్లో ఎవరూ లేకపోయినా సరే, తమ డెలివరీ బాయ్స్ వస్తువుల్ని వినియోగదార్ల ఇంట్లో పెట్టి వెళ్లేందుకు వీలుగా అమెజాన్ సంస్థ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. దీని పేరే అమెజాన్ కీ.
ఈ సేవని వినియోగించుకోవాలని అనుకునేవాళ్లు సుమారు రూ. 16 వేలు ఖరీదు చేసే స్మార్ట్ లాక్, కెమెరాని కొనుక్కోవాలి. స్మార్ట్ ఫోన్‌లోని ఓ ఆప్ సాయంతో ఈ స్మార్ట్ లాక్ పనిచేస్తుంది.
డెలివరీ చేసే వ్యక్తి ఇంటి దగ్గరకి రాగానే వినియోగదారుడి ఫోన్‌కి సమాచారం అందుతుంది. అతడు అనుమతిస్తే ఇంటి తలుపు తెరుచుకుంటుంది. డెలివరీ పార్సిల్‌ని పెట్టి తిరిగి వెళ్లే వరకూ అతడి ప్రతి కదలికనీ ఇంట్లో ఉండే కెమెరా రికార్డు చేస్తుంది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)