విమానానికి బంగారపు ఎస్కలేటర్.. రాజు దిగుతుండగా ఆగిపోయింది
సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ రష్యా పర్యటన సందర్భంగా ఇబ్బందికర పరిస్ధితిని ఎదుర్కొన్నారు. బంగారంతో చేసిన ఆయన విమాన ఎస్కలేటర్ మధ్యలోనే ఆగిపోయింది.
81 ఏళ్ల సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ తన ప్రైవేట్ విమానంలో రష్యా పర్యటనకు వెళ్లారు. రష్యా రాజధాని మాస్కో ఎయిర్‌పోర్ట్‌లో విమానం నుంచి దిగుతుండగా అప్పుడే ఆ బంగారు ఎస్కలేటర్ మధ్యలోనే ఆగిపోవడంతో ఆయన నడుచుకుంటూనే కిందకు దిగారు.
తొలిసారి సౌదీ రాజు చేస్తున్న ఈ రష్యా పర్యటన చారిత్రకమైనదని విశ్లేషకులు అంటున్నారు. సిరియాలో యుద్ధ విషయంలో ఈ రెండు దేశాలు భిన్నమైన వైఖరితో ఉన్నాయి. అయినప్పటికీ ఇరు దేశాల మధ్య ఇంధన, రక్షణ రంగాల్లో ఒప్పందాలు జరిగాయి.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)