You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఏపీ కొత్త గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్.అబ్దుల్ నజీర్, ప్రస్తుత గవర్నర్ ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ
పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఆదివారం ఉత్తర్వులు విడుదల చేసింది. కొత్తగా 12 మంది గవర్నర్ల నియామాకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమోదముద్ర తెలిపారు.ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా జస్టిస్ ఎస్.అబ్ధుల్ నజీర్‌ను నియమించారు.
జస్టిస్ అబ్ధుల్ నజీర్ సుప్రీంకోర్టు మాజీ జడ్జి. ప్రస్తుతం ఏపీ గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్ కు బదిలీ అయ్యారు.
మహారాష్ట్ర గవర్నర్‌గా రమేష్ బైస్, సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్‌ప్రసాద్, అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా త్రివిక్రమ్ పట్నాయక్, ఝార్ఖండ్ గవర్నర్‌గా రాధాకృష్ణన్, అసోం గవర్నర్‌గా గులాబ్‌చంద్ కటారియా, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా శివప్రసాద్ శుక్లా, మణిపూర్ గవర్నర్‌గా అనసూయ, మేఘాలయకు చౌహాన్, లద్ధాఖ్ గవర్నర్‌గా బీడీ మిశ్రా, నాగాలండ్ గవర్నర్‌గా గణేశన్‌ను నియమించారు.
ఏపీ కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎవరు?
ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా నియమితులైన ఎస్. అబ్దుల్ నజీర్ సుప్రీం కోర్టులో మాజీ న్యాయమూర్తిగా పని చేశారు. 'అయోధ్య తీర్పు' వెల్లడించిన ధర్మాసనంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో ఆయన పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత ఏపీ గవర్నర్ గా పని చేస్తున్న బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి కేంద్రం బదిలీ చేసింది. అలాగే ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర గవర్నర్ అనుసూయ యుక్యేను మణిపూర్ గవర్నర్‌గా నియమించారు.
మరోవైపు లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధాకృష్ణ మాథూర్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించి, ఆయన స్థానంలో బీడీ మిశ్రాను గవర్నర్‌గా నియమించారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నియామకాలు అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్ పేర్కొంది.
వివాదాల్లో భగత్ సింగ్ కోశ్యారీ
మహారాష్ట్ర మాజీ గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ గతంలో పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఛత్రపత్రి శివాజీ మీద చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఛత్రపతి శివాజీ ఐకానిక్ పర్సనాలిటీ అయినా అదంతా పాత రోజుల్లోనేనంటూ భగత్ సింగ్ కొశ్యారీ వ్యాఖ్యానించారు.
ఇప్పటి ఐకానిక్ పర్సనాలిటీస్ అంటే బీఆర్ అంబేడ్కర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీయేనంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే, దీనిపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, అప్పటి ఠాక్రే నేతృత్వంలోని శివసేన విమర్శలు చేశాయి. ఆయన పదవి నుంచి దిగిపోవాలంటూ డిమాండ్ చేశాయి.
అంతకు ముందు మరో వివాదంలో కూడా ఆయనపై విమర్శలు వచ్చాయి.
''గుజరాతీలు, రాజస్థానీలను మహారాష్ట్ర నుంచి ప్రత్యేకంగా ముంబయి, థానేల నుంచి పంపిస్తే ఇక్కడ డబ్బులు మిగలవు. ముంబై దేశానికి ఆర్థిక రాజధానిగా ఉండదు'' అంటూ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలను ఆయా రాజకీయ పార్టీలు ఖండించాయి.
ఇవి కూడా చదవండి:
- తుర్కియే భూకంపం: 15 ఇళ్లలో కేవలం ముగ్గురు మాత్రమే బతికారు.. అంతా అపార్ట్మెంట్ కింద సమాధయ్యారు
- రక్తహీనత: మన శరీరంలో రక్తం ఎందుకు తగ్గిపోతుంది, మళ్లీ పెరగాలంటే ఏం చేయాలి?
- ఎల్జీబీటీ: గే, ట్రాన్స్‌జెండర్ పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు ఎంత కష్టం, ఎలాంటి సమస్యలుంటాయి?
- బెలూన్: ఆకాశంలో 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు ఎగిరితే ఏమవుతుంది? ఇలాంటి బెలూన్ల తయారీకి ఎంత ఖర్చవుతుంది
- దావూదీ బోహ్రా ముస్లింల కార్యక్రమానికి నరేంద్ర మోదీ ఎందుకు వెళ్లారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)