Women Farmer: దొంగగా పేరుమోసిన భర్తను మార్చి కుటుంబమంతా గౌరవంగా బతికేలా చేసిన మహిళా రైతు కథ..
నర్మద చవాన్ మంచి రైతుగా పేరు తెచ్చుకున్నారు. ఔరంగాబాద్‌కు చెందిన నర్మద తన భర్తకున్న చెడ్డపేరును పూర్తిగా చెరిపేయగలిగారు. ఆమెతోపాటు ఆమె కుటుంబం మొత్తానికీ ఈ వ్యవసాయం గౌరవాన్ని తీసుకొచ్చారు.
ఔరంగాబాద్‌లోని వడజీలో కుటుంబంతోపాటు ఆమె జీవిస్తున్నారు. 14ఏళ్ల వయసులోనే ఆమెకు అయాజీ చవాన్‌తో పెళ్లి అయింది. నకిలీ బంగారం ఉంగరాలను అయాజీ అమ్మేవారు. అయాజీ చాలా తప్పులు చేసేవారని నర్మద చెప్పారు. దీని వల్ల ఆమె చాలా వేదనకు గురయ్యేవారు.
''ఇక్కడ ఎవరు ఏం చేసినా అన్ని వేళ్లూ నా భర్తవైపే చూపించేవారు. ఆయనే ఆ తప్పు చేసేవారని అనేవారు. కొంతమంది ఆయనపై నిఘా పెట్టేవారు కూడా. కొన్నిసార్లు ఆయన ఏమీ చేయకపోయినా.. ఆయన్ను దొంగగా ముద్రవేసేవారు. ఆయనపై ఆ ముద్ర అలానే ఉండిపోయేది.''
‘‘ఇదివరకు కొందరు మాపై నిరంతరం నిఘా పెట్టేవారు. ఎక్కడికి వెళ్లినా వెంట వచ్చేవారు. మా పిల్లలు ఊరు వెళ్లినా వారిని అనుమానంగా చూసేవారు. వారి దగ్గరకు వచ్చేటప్పుడు మహిళలు తమ బంగారు నగలను కొంగుతో కప్పుకునేవారు. ఎందుకంటే వారు బంగారాన్ని దొంగతనం చేస్తారేమోనని భయపడేవారు.’’
పిల్లలు పెద్దవారు అవుతున్నప్పుడు అసలు ఇలాంటి నిందల నుంచి ఎలాగైనా బయటపడాలని నర్మద భావించారు. అలా వ్యవసాయంవైపు భర్తను ఆమె మళ్లించారు.
‘‘మా మొదటి ముగ్గురు పిల్లలు పెరిగి పెద్దవాళ్లవుతున్నారు. నా భర్త జీవితాన్ని మార్చాలని నేను భావించాను. తన అలవాట్లు మార్చుకుని పనిచేసేలా ఆయన్ను ఒప్పించగలిగాను. అప్పటికే మా మావయ్య ఈ పొలాన్ని కొనుగోలు చేశారు.’’
ఇప్పుడు నర్మదా, ఆమె కుటుంబ సభ్యులు వ్యవసాయాన్ని విస్తరించాలని భావిస్తున్నారు. మొత్తంగా వీరికి ఐదుగురు కొడుకులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. తమ పిల్లలు ఎలాంటి తప్పూ చేయలేదని నిరూపించడానికి తమ ఇంటి దగ్గర నర్మద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేశారు.
''ప్రజలు మాపై ఆరోపణలు చేసేవారు. తప్పుడు కేసులు పెట్టారు. అందుకే మేం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేశాం. ఇప్పుడు ఎవరైనా ఫిర్యాదు చేస్తే, నా పిల్లలు, భర్త, అల్లుళ్లు ఇంట్లోనే ఉన్నారని మేం నిరూపించగలం. వారు సీసీటీవీ ఫుటేజీని స్క్రీన్‌పై చూడొచ్చు. ఆ రోజు వారు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు. వారు ఇంట్లో పడుకున్నారా? లేదా వేరే ఎక్కడికైనా వెళ్లారో ఆ దృశ్యాలను చూస్తే తెలుస్తుంది. అందుకే మేం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేశాం.''
ఇప్పుడు తమ పొలంలో నాలుగు ఎరకాల భూమిని నర్మద తన పేరిట మార్చుకున్నారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి.
''ఈ భూమి మహిళల పేరున ఉంటే చాలా మంచిది. ఎందుకంటే భర్త పేరున ఉంటే ఆయన తన సరదాలు, అలవాట్ల కోసం దీన్ని అమ్మేయొచ్చు లేదా తాకట్టు పెట్టొచ్చు. అప్పుడు కుటుంబం మొత్తం బాధపడుతుంది. ఈ భూమి దగ్గర ఉంటే పిల్లల భవిష్యత్‌కు ఉపయోగపడుతుంది. నా భర్తతోపాటు పిల్లలకూ ఇది తిండి పెడుతుంది. పైగా ఇది ఇది నా భర్త ఒక్కరిపైనే ఉంటే భవిష్యత్‌లో పిల్లలు నాకు ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు. నేను ఎవరినీ ఏదీ అడుక్కోవాలని అనుకోవట్లేదు. అందుకే నాలుగు ఎకగరాల భూమిని నా పేరిట మార్చుకున్నాను.’’
నేర ప్రవృత్తిని విడిచిపెట్టి మంచి మార్గంలో నడుస్తున్నందుకు నర్మద, అయాజీలను ఔరంగాబాద్ పోలీసులు సత్కరించారు. ప్రస్తుతం నర్మద, అయాజీ భూమిలో 1200 నారింజ చెట్లు ఉన్నాయి. వీరికి ఒక ట్రాక్టర్, ఒక ఎద్దుల బండి, మూడు బావులు ఉన్నాయి. ఇప్పుడు వీరు ఒక ఇల్లు కట్టుకోవాలని భావిస్తున్నారు. తమ పేరుతో ఒక రేషన్ కార్డు కూడా తీసుకోవాలని అనుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్లో క్రికెట్‌ను భారత్ వ్యాపార సంస్థలే నడిపిస్తున్నాయా? బీసీసీఐ నిధులు ఇవ్వకపోతే పాక్ క్రికెట్ బోర్డు కూలిపోతుందా?
- ఇండోనేషియా: 99 మంది పిల్లలు చనిపోవడంతో దగ్గు మందు సహా అన్ని రకాల సిరప్‌లపై నిషేధం
- లిజ్ ట్రస్: ప్రధాని అయిన 45 రోజులకే ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది, బ్రిటన్ తాజా రాజకీయాలపై తెలుసుకోవాల్సిన 8 పాయింట్లు
- ఇండియా మోస్ట్ వాంటెడ్ పాక్ తీవ్రవాదులను చైనా ఎలా రక్షించిందంటే...
- పాకిస్తాన్లో క్రికెట్‌ను భారత్ వ్యాపార సంస్థలే నడిపిస్తున్నాయా? బీసీసీఐ నిధులు ఇవ్వకపోతే పాక్ క్రికెట్ బోర్డు కూలిపోతుందా?
- దీపావళి టపాసులు అమ్మితే మూడేళ్లు జైలుశిక్ష, టపాసులు కాల్చితే 6 నెలలు జైలు శిక్ష
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)