ఉజ్జయినిలో మహాకాళేశ్వర్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

వీడియో క్యాప్షన్, ఉజ్జయినిలో మహాకాళేశ్వర్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

ఉజ్జయినిలో శ్రీ మహాకాళేశ్వర్ టెంపుల్ కారిడార్ మొదటి దశను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం 850 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ మహాకాళ్ లోక్ ప్రాజెక్ట్ మొదటి దశను నిర్మించారు.

మహాకాళ్ లోక్ ప్రాజెక్ట్‌ ద్వారా ఇక్కడి ఆలయాన్ని సందర్శించుకునే భక్తులకు ప్రపంచ స్థాయి ఆధునిక సౌకర్యాలు కల్పించారు.

ఆలయ ప్రాంగణాన్ని విశాలంగా తీర్చిదిద్దడంతో పాటు, ఇక్కడి చారిత్రక నిర్మాణాలను పునరుద్ధరించి పరిరక్షణ చర్యలు చేపట్టారు.

ఆలయ ప్రాంగణాన్ని గతంలో కన్నా ఏడు రెట్లు విశాలంగా చేశారు. దీంతో ఏటా ఇక్కడికి వచ్చే కోటిన్నర మంది భక్తుల సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)