GodFather: హీరోయిన్, రొమాన్స్, సాంగ్స్ లేకుండా చిరంజీవి నటన ఎలా ఉంది

వీడియో క్యాప్షన్, GodFather: హీరోయిన్, రొమాన్స్, సాంగ్స్ లేకుండా చిరంజీవి నటన ఎలా ఉంది

చిరంజీవి ఇప్పుడు `గాడ్ ఫాద‌ర్‌`గా మ‌న‌ముందుకొచ్చారు. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ట‌యిన `లూసిఫ‌ర్‌`కి ఇది రీమేక్‌. అక్క‌డ మోహ‌న్ లాల్ చేసిన పాత్ర‌ను ఇక్క‌డ చిరు పోషించారు. `లూసిఫ‌ర్‌` `గాడ్ ఫాద‌ర్‌`గా మారిన‌ప్పుడు చిరు ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టుగానే మారిందా?

లూసిఫ‌ర్‌తో పోలిస్తే క‌థ విష‌యంలో ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా ఎలాంటి మార్పులూ చేయ‌లేదు. కాక‌పోతే ఆ క‌థా గ‌మ‌నాన్ని మ‌రోలా న‌డిపాడు. లూసిఫ‌ర్‌లో ఉన్న పాత్ర‌లు కొన్ని గాడ్‌ఫాద‌ర్‌లో క‌నిపించ‌వు. కొత్త పాత్ర‌లు వ‌చ్చాయి. అయితే ప్ర‌తి పాత్ర‌కూ ఓ ప్రారంభం, ముగింపు ఇచ్చుకొంటూ వెళ్లాడు ద‌ర్శ‌కుడు.

ఉదాహ‌ర‌ణ‌కు పోలీస్ ఆఫీస‌ర్ (స‌ముద్ర‌ఖ‌ని) పాత్ర‌కు లూసిఫ‌ర్‌లో స‌రైన ఎండింగ్ లేదు. దాన్ని `గాడ్ ఫాద‌ర్‌`లో స‌వ‌రించారు. రీమేక్‌లో ఉన్న సౌల‌భ్యం అదే. మాతృక‌లోని ప్ల‌స్‌లు హైలైట్ చేస్తూ.. మైన‌స్‌ల‌ను దాచేస్తూ తీర్చిదిద్ద‌డం రీమేక్‌ల ప్ల‌స్ పాయింట్‌. మోహ‌న్ రాజా అదే చేశాడు.

నిజానికి ఇది చిరంజీవి సినిమా కాదు. ఆయ‌న సినిమాల్లో క‌నిపించే పాట‌లు, రొమాన్స్ ఇవేం ఉండ‌వు. ఆఖ‌రికి హీరోయిన్ కూడా. త‌న ప‌క్క‌న హీరోయిన్ లేకుండా చిరంజీవి చేసిన సినిమా ఇదే కావొచ్చు. ఈ విష‌యంలో చిరుని మెచ్చుకోవాలి. త‌న ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టుగా ఈ క‌థ‌ని మార్చ‌కుండా క‌థ‌కేం కావాలో అది ఇచ్చారు.

సినిమా మొద‌లైన 20 నిమిషాల వ‌ర‌కూ చిరు ఎంట్రీ ఉండ‌దు. మ‌ధ్య‌లో స‌త్య‌దేవ్ పాత్ర రెచ్చిపోతూ ఉంటుంది. చిరు ఎక్క‌డ‌? ఇంకా క‌నిపించ‌లేదేం? త‌ను రాడా? అనే ఆలోచ‌న ప్రేక్ష‌కుల‌కు, చిరు అభిమానుల‌కూ క‌లిగించ‌కుండా చాలా తెలివిగా ఈ స్క్రీన్ ప్లే రాసుకొన్నాడు ద‌ర్శ‌కుడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)