ఖర్జూరం సాగు: ‘ఒక్కసారి నాటితే 60 ఏళ్ల వరకు దిగుబడి’
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో ఖర్జూరం పంట దిగుబడికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఎడారి ప్రాంత దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి అయ్యే ఖర్జూరంను నేరుగా వ్యాపార అవసరాల కోసం ఇక్కడ సాగు చేస్తుండటం ఆసక్తిగా మారింది.
సాధారణంగా మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలలో ఖర్జూరం సాగు ఎక్కువ. ఇండియాలో రాజస్థాన్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఖర్జూరం పండిస్తారు.
అయితే, భారత్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ ఇప్పుడిప్పుడే ఖర్జూరం సాగుపై ఔత్సాహిక రైతులు కొందరు ఆసక్తి చూపుతున్నారు. చాలామంది ఇళ్లలో, పొలం గట్లపై ఈ మొక్కలు వేస్తున్నా వాణిజ్య పంటగా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన దాఖలాలు ఆంధ్రప్రదేశ్‌లో తక్కువే.
ఇప్పుడు ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన కొందరు రైతులు వాణిజ్య పంటగా ఖర్జూరాన్ని ఎంచుకున్నారు. అందుకు తగ్గట్టుగా ఒకేసారి 15 ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు చేస్తున్నారు.
ఇది ప్రయోగాత్మకమని అధికారులు చెబుతుండగా, ఇప్పటికే దిగుబడి మొదలు కావడంతో తమకు ఆశాజనకంగా ఉందనే అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- పొన్నియన్ సెల్వన్ రివ్యూ: మణిరత్నం సినిమా క్లాసిక్ అవుతుందా? కన్ఫ్యూజ్ చేస్తుందా?
- ఆంధ్రప్రదేశ్‌లో 'పేదలందరికీ ఇళ్లు' నిర్మాణం ఎందుకు ఆలస్యం అవుతోంది? ఈ ఆలస్యానికి బాధ్యులు ఎవరు?
- సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుతో అబార్షన్లు, మారిటల్ రేప్‌కు సంబంధించి మహిళల హక్కుల్లో వచ్చిన మార్పులు ఏంటి?
- మాగ్నస్ కార్ల్సన్-హాన్స్ నీమాన్: 19 ఏళ్ల కుర్రాడిపై చెస్ ప్రపంచ చాంపియన్ ఆరోపణలు ఎందుకు?
- యుక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనం.. అధికారిక పత్రాలపై సంతకం చేసిన పుతిన్
- 'ఈరోజు శానిటరీ ప్యాడ్స్ అడుగుతారు.. రేపు కండోమ్స్ అడుగుతారు' అన్న వ్యాఖ్యలపై బిహార్ ఐఏఎస్ ఆఫీసర్ విచారం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)