పొగ తాగని వారికీ ఊపిరితిత్తుల క్యానర్స్ వస్తోంది ఎందుకు?
గాలి కాలుష్యం క్యాన్సర్‌కు కారణమవుతుందని తాజా పరిశోధనలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పొగ తాగనప్పటికీ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోవడానికి కారణం ఇదేనని తెలిసింది.
'వయసు పెరిగే కొద్దీ మన శరీర కణాల్లో క్యాన్సర్‌కు కారణమయ్యే మార్పులు జరుగుతుంటాయి. ఇది సహజమే. కానీ అవి మాములుగా అయితే నిద్రాణంగా ఉంటాయి. కానీ గాలి కాలుష్యం ఊపిరితిత్తుల్లో ఉండే ఇలాంటి కణాలను నిద్ర లేపుతోంది. తద్వారా అవి పెరిగి గడ్డలు ఏర్పడుతున్నాయి' అని లండన్‌లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్ బృందం తెలిపింది.
మెడికల్ సైన్స్ ప్రపంచంలో ఇదొక కొత్త శకమని ఈ బృందానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ చార్లెస్ స్వాంటన్ అన్నారు. తద్వారా ఇప్పుడు క్యానర్స్ నివారణ కోసం మందులు తయారు చేయడం మరింత సులభంగా మారుతుందని చెబుతున్నారు.
'సాధారణంగా క్యానర్స్‌లో ఆరోగ్యకరంగా ఉండే కణాలపై ప్రభావం పడుతుంది. కణాల డీఎన్‌ఏలో అధిక స్థాయిలో మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నప్పుడు, ఒకానొక స్థాయికి చేరిన తరువాత అది క్యానర్స్‌గా మారుతుంది...' ఇప్పటి వరకు క్యాన్సర్‌ను ఇలాగే అర్థం చేసుకుంటూ వస్తున్నారు.
కానీ తాజా పరిశోధనతో ఆ తీరు మారనుంది.
పొగ తాగని వారికి కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎందుకు వస్తోంది? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఈ పరిశోధన చేపట్టారు. 2020లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 18 లక్షల మంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోయినట్లు డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో అత్యధిక మరణాలకు కారణం పొగ తాగటమే.
ఇవి కూడా చదవండి:
- బ్రిటన్-అమెరికా సంబంధాలు లిజ్ ట్రస్, బైడెన్ల పాలనలో మెరుగు పడతాయా, బలహీనపడతాయా?
- ఆంధ్రప్రదేశ్: ఈ గ్రామంలో మగవాళ్లు ఎక్కువగా చనిపోతున్నారు. ఎందుకు? ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోంది?
- బెంగళూరు వరదలు: సంపన్నులకు కూడా తప్పని కష్టాలు... ఇళ్లను ముంచెత్తిన వరదనీటితో ఇబ్బందులు
- దినేశ్ కార్తీక్: 15 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ జట్టులోకి రీఎంట్రీ.. ‘కలలు నిజమవుతాయి’ అంటూ ఎమోషనల్ ట్వీట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)