కాకినాడలో సుగంధ ద్రవ్యాలు పండిస్తున్న రైతు
దేశంలో సుగంధ ద్రవ్యాల సాగులో కొన్ని ప్రాంతాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. చాలా మంది ఇష్టపడి తినే బిర్యానీ వంటి వంటకాల్లో వాడే కొన్ని పదార్థాలు ఆయా ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వాటి సాగు తెలుగు నేలకు కూడా విస్తరిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాకు చెందిన ఓ రైతు తన పామాయల్ తోటలో అంతరపంటగా జాపత్రి, జాజికాయల మొక్కలు నాటారు. ఐదేళ్ల క్రితం నాటిన మొక్కల నుంచి ఇప్పుడు పంట దిగుబడి మొదలయ్యింది.
మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉందని రైతు చెబుతున్నారు. తన పంట గురించి ప్రచారం జరగడంతో కొందరు వ్యాపారుల నుంచి ఆర్డర్లు కూడా వచ్చాయని అంటున్నారు.
''ప్రభుత్వం నుంచి సబ్సిడీ లేదు కానీ, రైతులే వేసుకోవచ్చు. ఎకరానికి 80 మొక్కలు వేయవచ్చు. హైబ్రిడ్ రకమే మంచిది. మొక్కలు హైట్ తక్కువ. జాపత్రికి కేజీకి రూ.2 వేలు, కాయలు అయితే కేజీకి రూ. వెయ్యి వరకూ ధర పలుకుతోంది. మనకి మనమే మార్కెట్ చేసుకోవచ్చు. ఇప్పటికే కొందరు వ్యాపారులు నన్ను అడిగారు పంట ఇవ్వమని'' అని రైతు గుండ్ర అంబయ్య బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అజ్ఞాతంలో రాజపక్ష, అధ్యక్ష పదవి ఖాళీగా ఉంటే శ్రీలంకలో ఏం చేస్తారు
- Sri Lanka Crisis: వైరల్ అవుతున్న సైన్యం కాల్పుల వీడియో.. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది?
- గుజరాత్ అల్లర్ల కేసు: తీస్తా సెతల్వాద్ విషయంలో సుప్రీంకోర్టు వైఖరి నాటికి, నేటికీ ఎలా మారింది
- హజ్ యాత్రకు వెళ్లినప్పుడు ముస్లింలు ఏం చేస్తారు?
- వైసీపీ పేరు మార్పు..జీవితకాల అధ్యక్షుడిగా జగన్ అన్న పార్టీ నిర్ణయాన్ని ఎన్నికల సంఘం ఆమోదిస్తుందా
- క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి, అమర్నాథ్ యాత్రలో జరిగిన ప్రమాదాల్లాంటివి ముందే పసిగట్టలేమా
- ప్రపంచంలోనే తొలి ఇసుక బ్యాటరీ.. ఒకసారి విద్యుత్ నింపితే కొన్ని నెలలపాటు నిల్వ..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)