శ్రీలంక సంక్షోభం: తినడానికి ఏమీ లేక సముద్రం నీటిని తాగి స్పృహ తప్పి పడిపోయిన వృద్ధ జంట

వీడియో క్యాప్షన్, శ్రీలంక సంక్షోభం: తినడానికి ఏమీ లేక సముద్రం నీటిని తాగి స్పృహ తప్పి పడిపోయిన వృద్ధ జంట

శ్రీలంక నుంచి అక్రమంగా పడవలో ధనుష్కోటి బీచ్‌కు వచ్చి స్పృహతప్పి పడిపోయిన వృద్ధ దంపతులను తమిళనాడు మెరైన్ పోలీసులు రక్షించారు.

తమ దేశంలో నివసించే పరిస్థితులు లేకపోవడంతో భారత్‌లో శరణార్థులుగా ఆశ్రయం పొందేందుకు ఇక్కడికి వచ్చినట్లు వారు చెప్పారు.

శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, ఆహార కొరత తీవ్రంగా ఉంది.

ఫలితంగా చాలామంది శ్రీలంక ప్రజలు మార్చి 22 నుంచి భారత్‌లోని తమిళనాడుకు రావడం మొదలుపెట్టారు.

భారత్‌కు వచ్చే క్రమంలో ఇరు దేశాల సముద్రతీర ప్రాంతాల భద్రత నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.

స్వదేశంలో బతికేందుకు మార్గం లేకపోవడంతో శ్రీలంకవాసులు ఇలా అక్రమంగా భారత్‌లోకి వస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)