సికింద్రాబాద్ స్టేషన్‌లో ‘అగ్నిపథ్’ విధ్వంసం.. రైళ్లకు నిప్పు పెట్టిన నిరసనకారులు

వీడియో క్యాప్షన్, సికింద్రాబాద్ స్టేషన్‌లో ‘అగ్నిపథ్’ విధ్వంసం.. రైళ్లకు నిప్పు పెట్టిన నిరసనకారులు

అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు.

ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, హమ్‌సఫర్ రైళ్లకు నిప్పు పెట్టారు. తిరుపతి వెళ్లే రైలును ధ్వంసం చేశారు. ప

ట్టాలపై పార్సిళ్లను తగులబెట్టారు. స్టేషన్‌లోని దుకాణాలను ధ్వంసం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు.

ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు. పది రౌండ్లకు పైగా గాలిలోకి కాల్పులు జరిపారు. కొందరు ఆందోళనకారులకు గాయాలు అయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)