నిఖత్ జరీన్ తల్లితండ్రులతో బీబీసీ ఎక్స్‌క్లూజివ్: 'తెలంగాణ పేరును నా కూతురు స్వర్ణాక్షరాలతో లిఖించింది'

వీడియో క్యాప్షన్, నిఖత్ జరీన్: 'తెలంగాణ పేరును క్రీడారంగంలో నా కూతురు స్వర్ణాక్షరాలతో లిఖించింది'

ఆ తల్లి ఆనందానికి అవధుల్లేవు. ఇప్పుడు నువ్వు దేశానికే గర్వకారణమని కూతురును మెచ్చుకున్న ఆ తండ్రి సంతోషం అనంతం.

ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ గెలిచిన తరువాత టర్కీ నుంచి నిఖత్ జరీన్ తన కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడారు. విజయోత్సాహాన్ని తన తల్లి, తండ్రి, ఇతర కుటుంబ సభ్యులతో పంచుకున్నారు.

బీబీసీ తెలుగు కూడా ఈ విజయోత్సాహంలో పాలు పంచుకుంది. నిఖత్ ఇంటికి వెళ్ళి ఆమె తల్లితండ్రులను కలుసుకుని అభినందనలు తెలిపారు బీబీసీ ప్రతినిధి సురేఖ అబ్బూరి.

ఈ విజయం ఎలా ఉంది... ఒత్తిడికి గురయ్యారా అని బీబీసీ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, "ఫైనల్లో కొంత ఒత్తిడికి గురైన మాట నిజమే. ఇంత దూరం వచ్చి వెనక్కి తగ్గకూడదని అనుకున్నాను. అయితే, రెండో రౌండ్ దాటిన తరువాత నాకు నమ్మకం పెరిగింది. ఈసారి అన్ని మ్యాచులూ 5-0తో ఏకపక్షంగా గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది" అని నిఖత్ అన్నారు.

నిఖత్ జరీన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిఖత్ జరీన్

ఇప్పటికే బాక్సింగ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన నిఖత్ ఇప్పుడు సీనియర్ చాంపియన్‌షిప్ కూడా గెలిచి, గోల్డ్ మెడల్ సాధించి క్రీడారంగంలో తెలంగాణ పేరును స్వర్ణాక్షరాలతో లిఖించిందని చెబుతున్న ఆమె తల్లి పర్వీన్ సుల్తానా కూడా ఒకప్పుడు క్రీడాకారిణి. ఆమె కబడ్డీ ప్లేయర్. నిఖత్ తండ్రి మహమ్మద్ జమీల్ అహ్మద్ కూడా మంచి క్రికెటర్, ఫుట్ బాల్ ప్లేయర్.

కూతురు విజయానికి ఎంతో గర్వపడుతున్న ఈ తల్లితండ్రులు బీబీసీ తెలుగుతో సంభాషించారు. క్రీడల పట్ల వీరి కుటుంబ సభ్యులకు ఆసక్తి ఎలా కలిగింది, నిఖత్ ప్రపంచ స్థాయికి చేరుకోవడం వెనుక పడిన కష్టం ఎలాంటిదనే ప్రశ్నలకు సమాధానాలు వారి మాటల్లోనే విందాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)