రెండు అడుగులే ఉన్నావు ఉద్యోగానికి పనికిరావన్నారు.. ఆమె ఏం చేశారంటే..
31ఏళ్ళ గీత కుప్పుసామి తమిళనాడు లోని ఈరోడ్‌లో ఉంటారు. ఆమె ప్రత్యేకతేంటో తెలుసా? ఆమె ఎత్తు 2 అడుగులు. దీంతో చాలా మంది ఉద్యోగం ఇవ్వకుండా తిరస్కరించారు. ఇప్పుడామె సొంత వ్యాపారాన్ని ప్రారంభించి వైకల్యం ఉన్న వారికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆమె కథ.. ఆమె మాటల్లోనే..
నా పేరు గీత కుప్పుసామి. నేను తమిళనాడులోని ఈరోడ్ జిల్లా భవానీలో ఉంటాను.
నాకు ముఫ్పైఒక్కేళ్లు. ఎంబీఏ పూర్తిచేసి, కో ఆపరేటివ్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా చేశాను.
మా కుటుంబ పరిస్థితుల కారణంగా ఉద్యోగం చేయాల్సి వచ్చింది. చాలా ప్రయత్నించినా ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వలేదు.
వాళ్లంతా నా రూపం గురించే చూశారు తప్ప, నాలోని ప్రతిభను గుర్తంచలేదు.
మళ్లీ ఫోన్ చేస్తాం అని తప్పించుకునేవారు.
దాంతో నేనే సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాను.
తర్వాత నాకు జ్యోతిమణి పరిచయమయ్యారు. ఆమెకు కుట్టు మెషీన్ ఉండేది.
మేమిద్దరం కలిసి వైకల్యం గలవారికి ఉపాధి కల్పించాలని నిర్ణయించుకున్నాం.
ఒక షాపు తెరచి మాలాంటి వారికి ఉద్యోగాలిచ్చాం.
మా అసోషియేషన్‌లో కొందరు కేవలం పాకగలిగే వాళ్లున్నారు. రెండు కాళ్లు పనిచేయని వాళ్లున్నారు. మానసిక వైకల్యం గల చిన్నారులున్న తల్లి కూడా ఉన్నారు.
మాలాంటి వారికి వీలైనంత ఎక్కువమందికి ఉపాధి కల్పించాలి అనుకుంటున్నాం. చిన్న దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించి అందులో ఉద్యోగాలు ఇస్తున్నాం.
నేను వికలాంగురాలిని, అయితే నాకో పెద్ద లక్ష్యం ఉంది. ఉద్యోగాల్లో నాలాగా వికలాంగులెవర్నీ తిరస్కరించకూడదు.
కాబట్టి తిరస్కరణకు గురైన వాళ్ళలో వీలైనంత ఎక్కువ మంది వికలాంగులకు మేం ఉపాధికల్పిస్తున్నాం.
శారీరక వైకల్యం దేనికి ఆటంకం కాకూడదు. ప్రతి ఒక్కరిలో సామర్థ్యం ఉంటుంది.
నేను వికలాంగురాలిని అని నేను అనుకుంటే నేను ఏమీ సాధించలేకపోయేదాన్ని.
నాపై నాకు నమ్మకముంది.
ఎందుకంటే నాకు ఆత్మస్థైర్యం ఉంది, సామర్థ్యం ఉంది. అందుకే ఒక దుస్తుల యూనిట్‌ని ప్రారంభించి నాలాంటి వారికి ఉపాధి కల్పించడం ప్రారంభించాను.
మీరు కూడా జీవితంలో దేన్నైనా సాధించగలరు. సమస్యలు, వైకల్యాలను పట్టించుకోవద్దు.
మీలో ప్రతిభ, దానిపై విశ్వాసం ఉంటే మీరు తప్పకుండా జీవితంలో విజయం సాధిస్తారు. అందుకు నేనే సరైన ఉదాహరణ.
ఇవి కూడా చదవండి:
- వంటింట్లో మనకు తెలియకుండానే మనం చేసే 9 తప్పులు.. ఇవి చాలా ప్రమాదకరం అంటున్న నిపుణులు
- రాజ్యసభకు వైసీపీ అభ్యర్థుల ప్రకటన.. చిరంజీవి ఆచార్య నిర్మాతకు, ఇద్దరు తెలంగాణ వారికి ఎంపీ పదవులు ఎందుకు ఇచ్చారంటే..
- వారణాసి: విశ్వనాథ మందిరం, జ్ఞాన్వాపి మసీదు పక్కపక్కనే ఎలా నిర్మించారు?
- చేతనా రాజ్: ప్లాస్టిక్ సర్జరీ తర్వాత మరణించిన కన్నడ నటి, అసలేం జరిగింది?
- ‘వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఇచ్చేప్పుడు జాగ్రత్త.. ఉత్తర కొరియా వాళ్లు జాబ్‌లు కొట్టేస్తున్నారు’ - ఐటీ సంస్థలకు అమెరికా హెచ్చరిక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)