ఈ గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకూ మూడుసార్లు పెళ్లి చేస్తారు.. ఎందుకంటే

వీడియో క్యాప్షన్, ఈ సరిహద్దు గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకూ మూడు సార్లు పెళ్లి చేస్తారు, ఎందుకంటే

ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న మాలీస్ గిరిజన తెగలో ఇదొక ఆచారం. ఈ తెగలో పుట్టే ఆడపిల్లలకు మూడుసార్లు పెళ్లి చేస్తారు.

పుట్టిన ఐదేళ్లలోపు ఒకసారి, యుక్తవయసు రాగానే మరోసారి పెళ్లి చేస్తారు. ఈ రెండు పెళ్లిళ్లలో వరుడు ఉండడు. అయినా, వీటిని వివాహాలుగానే మాలీస్ గిరిజనులు పిలుస్తారు. మూడోసారి జరిగే పెళ్లిలో వరుడు ఉంటాడు.

ముందు జరిగే రెండు పెళ్లిళ్లు సామూహికంగా జరుగుతాయి. గ్రామంలో ఉన్న ఆడ పిల్లలందరికి ఒకేసారి ఈ వివాహాలు చేస్తారు. వరుడు ఉండడనే మాటే కానీ, గ్రామం మొత్తానికి పెళ్లి జరుగుతుందా అనేంత సందడిగా ఈ వివాహాలు చేస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)