రంజాన్: ముస్లింలకు మజ్జిగ పంపిణీ చేసిన హిందువులు..

వీడియో క్యాప్షన్, రంజాన్: ముస్లింలకు మజ్జిగ పంపిణీ చేసిన హిందువులు..

కాకినాడలో రంజాన్ ప్రార్థనల సందర్భంగా మత సామరస్యం పెంచేలా కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు.

నగరానికి చెందిన శ్రీ భోగి గణపతి పీఠం నిర్వాహకులు ఈద్గా వద్ద ప్రార్థనలకు హాజరయ్యారు. ముస్లిం లకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో ముస్లిం లకు మజ్జిగ పంపిణీ చేశారు.

కరోనా వంటి విపత్తుల కాలంలో అన్ని మతాలు సమైక్యంగా సేవలు నిర్వహించామని పీఠం ఉపాసకులు దూసర్లపుడి రమణ రాజు గుర్తు చేశారు. అన్ని మతాలు కలిసి మెలిసి సాగడమే ఈ పండుగల సారాంశం అని పేర్కన్నారు.

హిందూ, ముస్లిం ఐక్యత చాటేలా మజ్జిగ పంపిణీ చేసిన భోగి గణపతి పీఠం నిర్వాహకులను మసీదు గురువు రజాక్ అభినందించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)