KTR: ‘‘TRSను ఓడించాలని ప్రజలు అనుకుంటే, ఏ వ్యూహకర్తా మమ్మల్ని కాపాడలేరు’’

వీడియో క్యాప్షన్, KTR: ‘‘TRSను ఓడించాలని ప్రజలు అనుకుంటే, ఏ వ్యూహకర్తా మమ్మల్ని కాపాడలేరు’’

గత కొన్ని రోజులుగా తెలంగాణలో బీజేపీ, టీఆరెస్‌ల మధ్య మాటల యుద్ధం జోరందుకుంది. బీజేపీ రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో పట్టు సాధించాలని చూస్తుంటే టీఆర్ఎస్ జాతీయ స్థాయి రాజకీయల వైపు దృష్టి మళ్లిస్తోంది.

ఇదిలా ఉండగా, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో వేగం పెంచింది.

ప్రశాంత్ కిశోర్ స్థాపించిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) తెలంగాణలో టీఆర్ఎస్ కోసం పనిచేస్తుందని తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ధ్రువీకరించారు.

ఈ అంశాలన్నింటిపై బీబీసీ, కేటీఆర్‌తో సంభాషించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)