You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జహంగీర్‌పురి అల్లర్లు : భారతదేశంలో మత కలహాలు పెరుగుతున్నాయా?
- రచయిత, షాదాబ్ నజ్మీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్‌లో గత కొంత కాలంగా మత కలహాలు పెరుగుతున్నాయి. ఇటీవలే దిల్లీలోని జహంగీర్‌పురీలో హనుమాన్ జయంతి సందర్భంగా మత కలహాలు చెలరేగాయి. ఈ గొడవల్లో ఒక పోలీసుతో సహా తొమ్మిది మంది గాయపడ్డారు.
అంతకు ముందు శ్రీరామనవమి సందర్భంగా కూడా కొన్ని రాష్ట్రాల్లో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 2020లో జరిగిన దిల్లీ అల్లర్లలో సుమారు 50 మంది చనిపోయారు.
గణాంకాలు ఏం చెబుతున్నాయ్?
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం, మత కలహాలకు సంబంధించి 2020లో 857 కేసులు నమోదయ్యాయి.
2019తో పోలిస్తే ఇది 94శాతం ఎక్కువ. ఇందులో మెజారిటీ ఘర్షణలు దిల్లీలోనే చోటు చేసుకున్నాయి.
2014-2019 మధ్య దిల్లీలో చోటు చేసుకున్న మత కలహాల సంఖ్య 2 మాత్రమే.
కానీ 2020లో 520 మత ఘర్షణలు రిపోర్ట్ అయ్యాయి.
2016-20 మధ్య 3,399 మత కలహాల కేసులు నమోదు అయినట్లు ఇటీవలే కేంద్ర హోంశాఖ పార్లమెంటుకు తెలిపింది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాలతో ఈ కేసులు సరిపోతున్నాయి.
2014-20 మధ్య నమోదైన మొత్తం కేసులు 5,417.
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో చోటు చేసుకున్న మత కలహాలను బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో చోటు చేసుకున్న వాటితో నేరుగా పోల్చి చూడలేం.
2014 వరకు మతపరమైన అల్లర్లు, సాధారణ అల్లర్లు అంటూ విడివిడిగా గణాంకాలను నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నమోదు చేయలేదు.
అయితే 2006-12 మధ్య చోటు చేసుకున్న మత కలహాల మీద కేంద్ర హోంశాఖ గణాంకాలు అందుబాటులో ఉన్నాయి.
కేంద్ర హోంశాఖ గణాంకాల ప్రకారం 2008లో అత్యధికంగా 943 కేసులు రికార్డ్ అయ్యాయి.
2014లో 1,227 కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి.
కేంద్ర హోంశాఖ, నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాలను పోల్చి చూస్తే 2006-12 మధ్య యూపీఏ పాలనలో 5,142 మత కలహాలు చోటు చేసుకోగా 2014-20 మధ్య ఎన్‌డీఏ పాలనలో 5,147 కేసులు రికార్డ్ అయ్యాయి.
భారత్‌లో మత కలహాల సంఖ్య 2020 వరకు తగ్గుతూ వచ్చింది.
2014లో 2,001 ఘటనలు చోటు చేసుకోగా 1,227 మంది బాధితులుగా మారారు.
అయితే 2018 నాటికి కేసుల సంఖ్య 512కు తగ్గగా 812 మంది బాధితులయ్యారు.
ఇవి కూడా చదవండి:
- 'పెళ్ళి పేరుతో మాకు సంకెళ్లు వేయొద్దు...' ముగ్గురు చిన్నారి పెళ్ళికూతుళ్ల కథ
- ఇద్దరు బాయ్‌ఫ్రెండ్స్‌తో కలసి తల్లిని హత్య చేసిన 17 ఏళ్ల కూతురు.. ఏం జరిగిందంటే..
- Zero Mile: సున్నా మైలు రాయి ఎక్కడ ఉంది? భారతదేశానికి భౌగోళిక కేంద్ర బిందువు ఏది?
- రబ్బర్ పురుషాంగం: ఆశా వర్కర్లకు ఇచ్చే కిట్లలో మోడల్ పురుషాంగం.. వివాదం ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)