#RanbirAliaWedding: ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్‌ వివాహానికి ఎవరెవరు వచ్చారంటే..

రణబీర్ కపూర్, అలియా భట్ వివాహం ముంబయిలో జరిగింది.

ఈ జంట వివాహానికి బాలీవుడ్ ప్రముఖులు తరలివచ్చారు.

మిగతా బాలీవుడ్ తారల్లా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోకుండా ఈ జంట తమ నివాసంలోనే వివాహ బంధంతో ఒక్కటైంది.

రణబీర్ కపూర్ ముంబయి బాంద్రాలోని పాలీ హిల్‌లో ఉన్న వాస్తు బిల్డింగ్‌లో ఏడో అంతస్తులో ఉంటారు.

అదే బిల్డింగ్ ఐదో అంతస్తులో అలియా భట్ ఉంటారు.

అలియా, రణబీర్ పెళ్లి వేడుక మొత్తం ఇక్కడే జరిగింది.

గురువారం ఉదయం హల్దీ, మధ్యాహ్నం 3 తర్వాత వివాహం జరిగాయి.

ఈ జంట పెళ్లికి 50 మంది అతిథులు హాజరయ్యారు.

కపూర్, భట్ కుటుంబ సన్నిహితులకే ఆహ్వానం అందింది.

బైశాఖీ రోజు కపూర్ కుటుంబానికి చాలా ప్రత్యేకం.

1979 ఏప్రిల్ 13న బైశాఖీ రోజునే నీతూ, రిషి కపూర్ వివాహం జరిగింది.

43 ఏళ్ల తర్వాత అదే రోజున రణబీర్, అలియా పెళ్లాడారు.

రణధీర్ కపూర్, రీమా జైన్, కరణ్ జోహార్, శ్వేతా నందా, అమితాబ్ కూతురు, ఇతర బంధువులు ఈ వివాహానికి వచ్చారు.

కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్, లవ్ రంజన్, రాహుల్ భట్, షాహినా భట్, సోనీ రాజ్దాన్, పూజా భట్ కూడా హాజరయ్యారు.

రాహుల్ భట్, రీమా జైన్, వారి కొడుకు అర్మాన్ జైన్ కూడా ఈ వివాహానికి హాజరయ్యారు.

అంబానీ కుటుంబం తరఫున ఆకాష్, శ్లోకా ఈ పెళ్లికి వచ్చారు.

2012లో అలియా తొలిసారి నటించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమా వచ్చింది. మొదటి సినిమా విడుదలకు ముందే ఆమె రణ్‌బీర్ కపూర్ పై తనకున్న ప్రేమను బైటపెట్టారు.

అలియా భట్, రణబీర్ కపూర్‌ల లవ్‌స్టోరీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైందో ఈ కథనంలో చదవొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)