ఆదివాసీల నాగోబా జాతర ఎన్నో ప్రత్యేకతలు, ఏమిటో తెలుసా
గోండ్వానా ప్రాంతానికి చెందిన ఆదివాసీల ఆచార సంప్రదాయాల వేడుక నాగోబా జాతర.
పుష్యమాసాన్ని జాతరల నెలగా భావించే ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలు నాగోబా జాతరను జరుపుకుంటారు.
నాగోబా విగ్రహానికి అభిషేకంతో ఈ జాతర వేడుకలు ప్రారంభమవుతాయి. అభిషేక జలాల కోసం ఆదివాసీలు కొండకోనలు దాటి కాలినడకన గోదావరి నదిలో ఉన్న హస్తన మడుగుకు చేరుకుంటారు.
ఈ యాత్రలో సంప్రదాయం ప్రకారం ఎన్నో ఆచారాలు పాటిస్తారు.
జాతరను తమ సంస్కృతి పరిరక్షణ, సంబంధ బాంధవ్యాలను కలుపుకునే సంగమంగా ఆదివాసీలు నాగోబా జాతరను భావిస్తుంటారు.
జాతర భారీ కొనుగోళ్లతో సందడిగా సాగుతుంది. మహా పూజతో మొదలయ్యే ఈ జాతర, చివరి రోజు భేతాళ పూజతో ముగుస్తుంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)