అసదుద్దీన్ ఒవైసీ: ‘నాపై 4 రౌండ్లు ఫైరింగ్ జరిగింది.. నా కారు పంక్చర్ అయ్యింది’

వీడియో క్యాప్షన్, అసదుద్దీన్ ఒవైసీ: ‘నాపై 4 రౌండ్లు ఫైరింగ్ జరిగింది.. నా కారు పంక్చర్ అయ్యింది’

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ నుంచి దిల్లీకి వెళుతున్న దారిలో ఒక టోల్ ప్లాజా వద్ద తన కారుపై కాల్పులు జరిపారని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.

"కొద్దిసేపటి క్రితం ఛజర్సీ టోల్ గేట్ వద్ద నా కారుపై కాల్పులు జరిపారు. 4 రౌండ్లు ఫైరింగ్ జరిగింది.

ముగ్గురు, నలుగురు ఉన్నారు. ఆయుధాలు అక్కడే వదిలేసి అందరూ పారిపోయారు. నా కారు పంక్చర్ అయింది.

వేరే కారెక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాను. మేమంతా క్షేమంగా ఉన్నాం" అంటూ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)