You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Disha Case: అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టుకు ఎంక్వైరీ కమిషన్ నివేదిక
హైదరాబాద్‌లో జరిగిన దిశ అత్యాచారం, హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి జస్టిస్ సిర్పుర్కర్ కమిటీ సుప్రీంకోర్టుకు ఒక నివేదిక సమర్పించింది.
ఈ ఘటనపై తమ దర్యాప్తు పూర్తి చేసిన ఎంక్వైరీ కమిషన్ జనవరి 28న సుప్రీంకోర్టుకు తన నివేదికను సమర్పించినట్లు ఎంక్వైరీ కమిషన్ సెక్రటరీ చెప్పారు.
ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఎంక్వైరీ కమిషన్ వివిధ డాక్యుమెంటరీ రికార్డులు సేకరించింది.
వీటిలో దర్యాప్తు రికార్డులతోపాటూ, ఫోరెన్సిక్ నివేదికలు, పోస్టుమార్టం నివేదికలు, ఘటనాస్థలంలో తీసిన ఫొటోలు, వీడియోలు లాంటివి ఉన్నాయని ఎంక్వైరీ కమిషన్ సెక్రటరీ వివరించారు.
ఎంక్వైరీ కమిషన్ తమ దర్యాప్తులో భాగంగా 2021 ఆగస్టు 21 నుంచి 2021 నవంబర్ 15 వరకూ 47 రోజులపాటు విచారణ చేపట్టింది. ఆ సమయంలో మొత్తం 57 మంది సాక్ష్యులను విచారించి, వారి వాంగ్మూలం రికార్డు చేసింది. కోవిడ్-19 ఆంక్షలకు లోబడి ఈ విచారణ బహిరంగంగా నిర్వహించారు.
2021 నవంబర్ 16 నుంచి నవంబర్ 26 వరకూ ఎక్వైరీ కమిషన్ విచారణకు హాజరైన తెలంగాణ రాష్ట్రం తరఫు న్యాయవాదులు, పోలీస్ అధికారులు, ఇతరులు తమ వాదనలు వినిపించారు.
2019 డిసెంబర్ 06న జరిగిన ఘటనకు సంబంధించిన ఎంక్వైరీ కమిషన్ వివిధ ప్రాంతాలలో తనిఖీలు జరిపింది.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీ.ఎస్.సిర్పుర్కర్ అధ్యక్షతన ఒక విచారణ కమిషన్ నియమిస్తూ సుప్రీంకోర్టు 2019 డిసెంబర్ 12న ఆదేశాలు జారీ చేసింది.
దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులైన మహమ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్‌ల ఎన్‌కౌంటర్ ఘటనపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన ఈ ఎంక్వైరీ కమిషన్ మిగతా సభ్యుల్లో బాంబే హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్పీ సొందూర్ బల్దోటా, సీబీఐ మాజీ డైరెక్టర్ డీ.ఆర్.కార్తికేయన్ కూడా ఉన్నారు.
2019 డిసెంబర్లో పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో నిందితులను ఎన్‌కౌంటర్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్19 లక్షణాలు ఉన్నవారికి టెస్టులు చేయకుండానే కరోనా కిట్లు పంచడం కరెక్టేనా?
- బ్యాంకు హ్యాక్ అయితే ఖాతాదారుల పరిస్థితి ఏంటి? వారి డబ్బు ఎవరు చెల్లిస్తారు?
- హైమెనోప్లాస్టీ: కన్వత్వ శస్త్రచికిత్సలపై ఎందుకు నిషేధం విధించాలని చూస్తున్నారు?
- అమెరికాలో పరమహంస యోగానంద ఆశ్రమంలో మహాత్ముడి అస్థికలు.. గాంధీ వారసులకు దీనిపై అభ్యంతరం ఎందుకు
- కరీంనగర్లో రోడ్డు పక్కన పనిచేసుకుంటున్నవారిపైకి దూసుకెళ్లిన కారు, నలుగురు మహిళల దుర్మరణం
- సీనియర్ సిటిజన్లను టార్గెట్ చేస్తున్న సైబర్ మోసగాళ్లు.. తప్పించుకోవడం ఎలా
- బ్యాక్టీరియాలు మందులకు లొంగట్లేదు.. చిన్నచిన్న ఇన్ఫెక్షన్లకూ యాంటిబయోటిక్స్ వాడటమే కారణమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)