ఏ వయసులో గర్భందాల్చితే మంచిది

భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మహిళలు తమ తొలిబిడ్డను పొందే సగటు వయసు పెరుగుతోంది.

మహిళలు విద్య, కెరీర్‌పై ఎక్కువ శ్రద్ధ చూపుతుండటం, అన్ని విధాలా స్థిరపడిన తర్వాతే పెళ్లి, పిల్లల్ని కనడం ప్లాన్ చేసుకుంటుండటం దీనికి ప్రధాన కారణం.

ఆధునిక వైద్యం- వయసు మీరిన మహిళలకూ సంతానావకాశాలను కల్పిస్తుండటం వల్ల కూడా తొలి సంతానాన్ని పొందే వయసు మునుపటి కన్నా పెరుగుతోంది.

కొంత వయసు దాటాక స్త్రీలు బిడ్డలను కనడం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. 35- 40 ఏళ్లు దాటిన మహిళలు గర్భం దాల్చినపుడు.. తల్లి, బిడ్డా ఇద్దరూ అనారోగ్య సమస్యల బారినపడే అవకాశముంది.

గర్భం దాల్చబోయే ముందు, గర్భంతో ఉన్నపుడు, కాన్పు సమయంలో.. ఇలా ప్రతి దశలోనూ తల్లికి సమస్యలు తలెత్తుతాయి.

వయసు పెరిగే కొద్దీ సంతానం కలిగే అవకాశాలు తగ్గుతుంటాయి. అప్పుడు కృతిమ పద్ధతుల వైపు దృష్టి సారించాల్సి ఉంటుంది. కృత్రిమ పద్ధతుల ద్వారా గర్భం దాల్చినప్పుడు సాధారణ వయసు మహిళల కంటే వయసు మీరిన మహిళల్లో ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటాయి.

లేటు వయసులో గర్భం దాలిస్తే వచ్చే ఆరోగ్య సమస్యల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)