సంక్రాంతి స్పెషల్ వంటకాల కథ తెలుసా
సంక్రాంతి పండుగ వ్యవసాయ ఆధారిత దేశంలో భూమికి, ప్రకృతికి చేతికొచ్చిన పంటతో కృతజ్ఞతలు తెలిపే పండుగ. కుటుంబమంతా ఒక్క చోటే చేరి పండుగను జరుపుకుంటారు.
అయితే, ఈ మూడు రోజులూ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కొన్ని పిండివంటలను కచ్చితంగా వండుతారు. సంక్రాంతికి ప్రధానంగా వండే పిండి వంటలు ఏంటి?
సంక్రాంతి, ధనుర్మాసంలో వండుకునే పిండివంటల ప్రాశస్త్యం గురించి ఫుడ్ క్యూరేటర్ రాజేశ్వరి పూతలపట్టు, ఆయుర్వేదిక్ వైద్యుడు,, ఆహార చరిత్రపై పుస్తకాలు రచించిన డాక్టర్ జీవీ పూర్ణ చందు బీబీసీకి వివరించారు.
భోగి మంటల్లో గతాన్ని, పేరుకుపోయిన చెత్తను తగులబెట్టి పండగ దీపాన్ని పెట్టడంతో సంక్రాంతి పండుగ మొదలవుతుంది. భోగి నాడు కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా శాకాహార వంటలు చేస్తే, రాయలసీమలో ఇడ్లీలు, పొట్టేలు మాంసం తింటారు.
మినపప్పు, ఇడ్లీ నూక లేదా బియ్యంతో చేసిన ఇడ్లీలను ఆవిరి పై ఉడికించి పొట్టేలు మాంసంతో కలిపి తింటారు.
పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)