You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్: భారత చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణకు సాదరంగా ఆహ్వానం పలికిన సీఎం జగన్ - Newsreel
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సాదరంగా ఆహ్వానం పలికారు. విజయవాడ సందర్శించిన జస్టిస్ రమణకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో తేనీటి విందు ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాబినెట్ సహచరులను చీఫ్ జస్టిస్‌కు పరిచయం చేశారు. అంతకుముందు, వైఎస్ జగన్ సతీ సమేతంగా భారత ప్రధాన న్యాయమూర్తికి ఆహ్వానం పలికారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేకే మహేశ్వరితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఈ తేనీటి విందుకు హాజరయ్యారు.
"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలుగు మాట్లాడే వ్యక్తి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం" అని ఈ సందర్భంగా జగన్ అన్నారు.
జస్టిస్ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ, "సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రానికి తొలిసారిగా వచ్చిన సందర్భంలో సాదరంగా ఆహ్వానించి, తేనీటి విందును ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు. ఆంధ్ర రాష్ట్రం మరెంతో అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు. క్రిస్టమస్ సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
జస్టిస్ ఎన్‌వీ రమణపై ఆరోపణలు చేస్తూ వైఎస్ జగన్ 2020 అక్టోబర్‌లో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డేకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత జస్టిస్ రమణను జగన్ కలుసుకోవడం ఇదే మొదటిసారి.
వైఎస్ జగన్ రాసిన లేఖను సుప్రీం కోర్టు ఈ ఏడాది మార్చి నెలలో ఇన్-హౌజ్ ప్రక్రియలో డిస్మిస్ చేసింది.
ఇవి కూడా చదవండి:
- మత ప్రచారకులను రావొద్దంటున్న ఈ బోర్డులు నిజంగానే ఉన్నాయా?
- భారతీయ యువతులు చైనా యువకుల్ని ఎందుకు పెళ్లి చేసుకోరు?
- ''కౌరవులు టెస్ట్ ట్యూబ్ బేబీలే... వేదకాలంలోనే విమానాలు''
- నాట్రడామ్ చర్చి: ఏసుక్రీస్తు ముళ్ల కిరీటం, శిలువ అవశేషం, జీసస్ గోరు ఇక్కడే ఉన్నాయి
- నార్త్ పోల్లోని శాంటా ఇల్లు ఇది... ఇక్కడికి ఎలా వెళ్లాలో తెలుసా?
- గర్భిణులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే.. పిల్లలు ఎర్రగా పుడతారా?
- ‘రెచ్చగొట్టే డ్రెస్ వేసుకుని వేశ్యాలోలత్వాన్ని ప్రేరేపించార’ని నటిపై కేసు
- ‘క్రైస్తవ మత ప్రచారకుడిని చంపిన అండమాన్ ఆదిమజాతి ప్రజలు’
- జెరూసలెం: మూడు మతాలకు పవిత్ర క్షేత్రంగా ఎలా మారింది?
- బ్రిటన్, అమెరికాల్లో క్రిస్మస్ను నిషేధించినప్పుడు ఏం జరిగింది
- ‘‘వాటికన్ ఒక గే సంస్థ’’: క్రైస్తవ పూజారుల ‘రహస్య జీవితాలు బట్టబయలు చేసిన’ జర్నలిస్టు
- మొఘల్ చక్రవర్తుల కాలంలో క్రిస్మస్ ఎలా జరిగేది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)