You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్: ‘తొలి ఒమిక్రాన్ కేసు అని ప్రచారం చేయొద్దు’ - శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి : BBC Newsreel
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ కేసు నమోదు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జగన్నాధ రావు తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం (10.12.21) సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
సంతబొమ్మాళి మండలం ఉమ్మిలాడకు చెందిన ఒక వ్యక్తి గత నెల 22వ తేదీన లండన్ నుంచి ముంబయి వచ్చి అక్కడ పరీక్షలు చేయించుకున్నాడని, అక్కడ నెగిటివ్ రావడంతో 23వ తేదీన స్వగ్రామం వచ్చారని డీఎంహెచ్ఓ పేర్కొన్నారు.
ఆ వ్యక్తి వచ్చి ఏడు రోజులు కావడంతో సాధారణ పరీక్షల్లో భాగంగా మళ్లీ టెస్టు చేయగా.. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యిందని చెప్పారు.
అయితే అది కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కాదనిపిస్తోందని తెలిపారు. అతని శాంపిల్స్ హైదరాబాద్‌కు పంపించామన్నారు.
పరీక్ష ఫలితాలు రావడానికి ఇంకా మూడు రోజుల సమయం పడుతుందని అప్పటివరకు ఒమిక్రాన్ అంటూ వదంతులు ప్రచారం చేయవద్దని డీఎంహెచ్ఓ జగన్నాధ రావు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని ఏ పరీక్షతో తెలుస్తుంది?
- తదుపరి మహమ్మారి కోవిడ్ కంటే ప్రాణాంతకంగా ఉంటుందా
- జనరల్ బిపిన్ రావత్ అంటే ప్రధాని మోదీకి ఎందుకంత ఇష్టం?
- వీర్యాన్ని ఎవరు దానం చేయొచ్చు? ఎన్నిసార్లు చేయొచ్చు? చట్టం ఏం చెబుతోంది?
- చెడ్డీ గ్యాంగ్: గుజరాత్ నుంచి వచ్చారు.. పగలు రెక్కీ, అర్థరాత్రి దోపిడీ
- హ్యూమన్ రైట్స్ డే: మనిషిగా మీకున్న హక్కులు ఇవి...
- ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలతో ఫేక్ ప్రొఫైల్స్.. పర్సనల్ చాట్ బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్
- భారతీయుల దృష్టిలో ప్రేమ, పెళ్లి అంటే ఏమిటి
- రైతుల నిరసనలకు ముగింపు: ‘డిసెంబరు 11 నుంచి శిబిరాలు ఖాళీ చేస్తాం, జనవరి 15న సమీక్షించుకుంటాం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)