విశాఖలో ఈ చిన్నారి విగ్రహాన్ని ముందుకొస్తున్న సముద్రం మింగేస్తుందా? -ఫోటో ఫీచర్

ఆర్కే బీచ్ వద్ద సముద్రం ముందుకు రావడంతో తీరం కోతకు గురై చిల్డ్రన్ పార్క్ చాలా వరకు ధ్వంసమైంది. అలల తాకిడికి పార్కు లోపల భూమి బీటలు వారింది. ఆర్కే బీచ్‌ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు 200 మీటర్ల మేర భూమి కోతకు గురైంది.