You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC News తెలుగుతో మీ ప్రపంచాన్ని విస్తరించుకోండి
అనేక భాషల్లో, వివిధ వేదికలపై నాణ్యమైన, ప్రభావవంతమైన వార్తలను అందిస్తోంది బీబీసీ న్యూస్ వరల్డ్ సర్వీస్.
రేడియో, టెలివిజన్, డిజిటల్, మొబైల్, సోషల్ మీడియా వేదికలపై మొత్తం 42 భాషల్లో బీబీసీ వార్తలు ప్రజలకు అందుతున్నాయి.
ప్రతి వారం కొన్ని కోట్ల మంది ప్రజలు బీబీసీ వార్తలను చదువుతున్నారు, వీక్షిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కృతులు, సంప్రదాయాలలో బీబీసీ ప్రముఖ పాత్ర పోషిస్తోందని దీని ద్వారా అర్థమవుతోంది.
బీబీసీ న్యూస్ వరల్డ్ సర్వీస్ చేసే ప్రతి పనిలో ప్రేక్షకులకే మొదటి స్థానం. అలాగే, "మీ ప్రపంచాన్ని విస్తరించుకోండి" (Make More of Your World) ప్రచారానికి కూడా ప్రేక్షకులే సూత్రధారులు.
వాళ్ల కలలు పెద్దవి. ప్రపంచంలో తమదైన ముద్ర వేయగల సామర్థ్యం ప్రతి ఒక్కరికీ ఉందని వారు విశ్వసిస్తారు. తమ గ్రామాలు లేదా పట్టణాలు, నగరాల్లో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా.
అది వారికే సొంతమైన ముద్ర. వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు లాంటి అంశాల్లో విలువలు ఉండాలని విశ్వసిస్తారు.
ఈ ప్రపంచంలో వారిది తమదైన ప్రపంచం. ఎన్నెన్నో అవకాశాలతో స్వాగతించే ప్రపంచం.
మా ప్రేక్షకుల్లో అధిక శాతం ముఖ్యంగా యువతరం వ్యక్తిగత పురోగతిపై దృష్టి సారిస్తోంది. ప్రేక్షకుల మనోభావాలను తెలుసుకోవడం కోసం మేం చేసే ప్రయత్నాల్లో ఈ విషయం స్పష్టమైంది. నీ వెనుక ఏం ఉందన్నది కాదు, మున్ముందు నీవేం చేస్తావన్నదే ముఖ్యం. వ్యక్తిగతంగా పురోగమించాలి. పది మందిలో ప్రత్యేకంగా నిలబడాలి. ఆ తపనే ఈ తరంలో అధికంగా కనిపిస్తోంది.
అందుకే, ఈ ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకోవడానికి బీబీసీ న్యూస్ వరల్డ్ సర్వీస్ వారికి సహకరిస్తుంది. ఈ ప్రపంచంలో తమ స్థానమేమిటనే ప్రశ్నకు సమాధానాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది.
అంటే, వారు తమ ప్రపంచాన్ని మరింతగా అస్వాదిస్తారు.
వార్తలు అనగానే మనకు వాటిని చూసే, చదివే వ్యక్తుల కన్నా కథనాలే గుర్తుకు వస్తాయి. 'ప్రపంచాన్ని మరింత విస్తరించుకోండి' అనడంలో అర్థం ప్రేక్షకులకు కలిగే ప్రయోజనమే వార్తలను నిర్వచిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రేక్షకులు లేదా పాఠకులకు తమదైన ప్రపంచానికి ఈ మొత్తం ప్రపంచంలో ఎక్కడ తగిన స్థానం ఉందో అర్థం చేసుకోవడానికి మా వార్తలు తోడ్పడతాయి.
"మీ ప్రపంచాన్ని మరింతగా విస్తరించుకోండి" అంటే వార్తలను చూస్తున్న ప్రేక్షకుల దృక్కోణం, వారికి అందించే స్ఫూర్తి, సాధికారతలను దృష్టిలో పెట్టుకుని బీబీసీ కథనాలను అందించడం.
వార్తా కథనాలు వారికి ఎంత ప్రేరణగా నిలిచాయి, ఎంత సానుకూలంగా ప్రభావితం చేశాయి అన్నదే ఇక్కడ ముఖ్యం. వారి ప్రపంచాన్ని విస్తృతం చేయగల వార్తలను మేం అందిస్తాం.
మా ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నంలో భాగంగా వివిధ భారతీయ భాషల్లో టీవీ, రేడియో, ఓటీటీ, సోషల్ మీడియా తదితర వేదికలపై మా బ్రాండ్ ప్రచారాన్ని నిర్వహిస్తాం.
ఇప్పటికే, భారతదేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయక, ప్రేరణాత్మక కథనాల సంకలనాన్ని తయారుచేశాం. ఎందుకంటే, ప్రాపంచిక దృష్టి విశాలమైతే ఏదైనా సాధ్యమే.
మీరు కూడా ఈ ప్రచారంలో పాలుపంచుకోవచ్చు.
మీ ప్రపంచాన్ని మరింత ఆస్వాదిస్తూ, ఈ ప్రపంచంలో మీ గుర్తింపును చాటిచెప్పే ప్రయత్నాలు చేసినట్లయితే, లేదా మీకు తెలిసినవారు ఆ ప్రయత్నాలను విజయవంతంగా చేసినట్లయితే ఆ సమాచారాన్ని మీరు మాకు పంపించొచ్చు. మీ స్టోరీని [email protected] కి పంపించొచ్చు.
మీ కథ మీ చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తినిచ్చే అవకాశాన్ని కల్పించే వేదిక ఇది.
అలాగే, మా ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్ ఉపయోగించి బీబీసీ వర్చువల్ బిల్‌బోర్డ్‌పై కూడా మీరు కనిపించవచ్చు.
అంతే కాకుండా, మా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా మీ కథను ప్రసారం చేసే అవకాశం కూడా ఉంది.
అందుకోసం, ఫిల్టర్ సెక్షన్‌లో 'బీబీసీ న్యూస్' కోసం వెతకండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.
@BBCTelugu అని మీ పోస్ట్‌లో ట్యాగ్ చేయడం మరచిపోకండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)