You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పీవీ సింధు: పద్మభూషణ్ అవార్డు అందుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి - Newsreel
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పద్మ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2020 సంవత్సరానికి ప్రకటించిన పురస్కారాలను ప్రదానం చేశారు.
మరణానంతరం పద్మవిభూషణ్‌కు ఎంపికైన మాజీ మంత్రి సుష్మస్వరాజ్ తరఫున ఆమె కుమార్తె అవార్డు స్వీకరించారు.
ఒలింపిక్ పతక విజేత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు.
గాయకుడు అద్నాన్ సమీ, నటి కంగన రనౌత్, హాకీ మహిళల జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ తదితరులు పద్మశ్రీ అవార్డులు రాష్ట్రపతి నుంచి స్వీకరించారు.
2020కి గాను ఏడుగురికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మభూషణ్, 95మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి.
వివిధ రంగాల్లో దేశానికి అందించిన సేవలకు గాను ఈ పురస్కారాలు ప్రదానం చేస్తారు.
ఛత్తీస్‌గఢ్: సీఆర్పీఎఫ్ జవాన్ కాల్పుల్లో నలుగురి మృతి, గాయపడిన ముగ్గురికి భద్రాచలంలో చికిత్స
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని సీఆర్పీఎఫ్ క్యాంపులో ఓ జవాన్ కాల్పులు జరపడంతో సహచర జవాన్లు నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
మరయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాలపల్లి సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
క్యాంప్‌లో ఉన్న రితేష్ రంజన్ అనే జవాను హఠాత్తుగా బుల్లెట్ల వర్షం కురిపించడంతో సహచరులు నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ కాల్పులకు గల కారణం తెలియరాలేదు. దీనిపై విచారణకు ఆదేశించినట్లు సీఆర్‌పీఎఫ్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
గాయపడిన ముగ్గురు జవాన్లను తెలంగాణలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- సవ్యసాచి: ‘ఇది కండోమ్ ప్రకటనా? నగల ప్రకటనా?’- ఈ బ్రాండ్‌ను ఎందుకు నిషేధించమంటున్నారు
- వాట్సాప్ స్కాములతో జాగ్రత్త
- ‘పాతాళానికి ద్వారాలు’.. భారతదేశంలో మెట్ల బావులు
- మెటా: ఫేస్‌బుక్ కొత్త పేరుపై ఎందుకు జోకులు పేలుతున్నాయి?
- పళ్లు ఎంతసేపు తోముకోవాలి? రెండు నిమిషాలు బ్రష్ చేస్తే చాలా? సైన్స్ ఏం చెబుతోంది?
- ఆంధ్రప్రదేశ్ తీరాన్ని సముద్రం మింగేస్తుందా
- వాతావరణ కాలుష్యానికి ధనవంతులే కారణమా
- డాక్టర్‌ను సంప్రదించకుండా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మందులు వాడటం మేలేనా?
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)