You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రకాశ్‌రాజ్ - మా ఎన్నికలు: 'నేను తెలుగు బిడ్డను కాదన్నారు అందుకే రాజీనామా చేస్తున్నా' - Newsreel
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు నటుడు ప్రకాశ్ రాజ్ ప్రకటించారు.
ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదని, అతిథిగానే వచ్చాను, అతిథిగానే ఉంటానని ఆయన చెప్పారు.
ఓటమిని జీర్ణించుకున్నాను కాబట్టే రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
తెలుగు బిడ్డను ఎన్నుకున్నారని, తెలుగు వ్యక్తే 'మా' అధ్యక్షునిగా ఉండాలని సభ్యులు కోరుకున్నారని ఆయన చెప్పారు.
"నేను తెలుగు బిడ్డను కాదన్నారు కాబట్టే రాజీనామా చేస్తున్నాను. ఇలాంటి ఐడియాలజీ ఉన్న అసోసియేషన్‌లో ఉండి పని చేయలేను, అవసరమైతే బయట ఉండి పని చేస్తాను. రాజకీయ సపోర్ట్ అవసరం లేదనుకున్నాను, కానీ అవసరం ఉందని నిరూపించారు. దీంతో అయిపోలేదు, అలా మొదలయ్యింది కాదు, ఇప్పుడే మొదలయ్యింది" అని ఆయన అన్నారు.
అయితే, తెలుగు సినిమాల్లో నటిస్తుంటానని, వారితో కలిసి పని చేస్తానని ప్రకాశ్ రాజ్ చెప్పారు. మా సభ్యత్వం లేకపోతే నన్ను నటించేందుకు అనుమతించరా? అని ఆయన ప్రశ్నించారు.
'మా' తో తనకు 21 ఏళ్ల అనుబంధం ఉందని 'మా' ఎన్నికల ఫలితాలపై ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన అన్నారు.
ప్రాంతీయతగానే ఎన్నికలు జరిగాయి. ఇలాంటి(ప్రాంతీయత) ఎజెండాతో ఉన్నఅసోసియేషన్‌లో నేను ఉండలేను. అబద్దాలు చెప్పలేను. అలాంటి వాతావరణంలో ఉండలేను అని ప్రకాశ్ రాజ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- యూపీ: ‘రైతుల్ని కారుతో గుద్ది చంపిన కేసు’లో కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా అరెస్ట్
- 'వృద్ధాప్యం ఒక వ్యాధి, దాన్ని నయం చేయవచ్చు' -హార్వర్డ్ శాస్త్రవేత్త డేవిడ్ సింక్లెయిర్
- చైనాలో తైవాన్ శాంతియుతంగా కలవాల్సిందేనన్న షీ జిన్‌పింగ్ -BBC Newsreel
- ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎందుకు పతనమవుతోంది?
- ఎయిర్ ఇండియా మళ్లీ టాటా గూటికి చేరడం వల్ల ఎలాంటి మార్పులు రావచ్చు?
- అస్సాంలో ముస్లిం యువకుడి హత్యపై ఓఐసీ ప్రకటన.. ఇస్లామిక్ దేశాల జోక్యంపై భారత్ ఏమందంటే..
- హెటిరో ఫార్మా సంస్థలో ఐటీ సోదాలు, రూ. 142 కోట్ల నగదు స్వాధీనం
- పాకిస్తాన్లో భూకంపం, స్పెయిన్‌లో బద్దలైన అగ్నిపర్వతం... ఈ వారం విశేషాల ఫోటో ఫీచర్
- "చపాతీని కొలవడానికి నా భర్త రోజూ స్కేలు తీసుకొని భోజనానికి కూర్చుంటాడు!"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)