భార్య ఉరేసుకుని చనిపోతుంటే, వీడియో తీసిన భర్త, మనిషి ఎందుకిలా మారుతున్నాడు

వీడియో క్యాప్షన్, భార్య ఉరేసుకుని చనిపోతుంటే, వీడియో తీసిన భర్త, మనిషి ఎందుకిలా మారుతున్నాడు?

అది ఒల్లు గగుర్పొడిచే వీడియో. నిద్ర పట్టనివ్వని బీభత్స దృశ్యం. మనిషి ప్రాణం తీసుకోవడం ఇంత చవక ఎందుకు అయ్యింది అని చరిచినట్టు అనిపించే దృశ్యం.

చాలా కూల్‌గా చాలా నింపాదిగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అలా ఒక మనిషి ప్రాణం తీసుకోవడం, ఇంకో మనిషి దాన్ని నింపాదిగా వీడియో తీయడం. చూడ్డానికి సింపుల్గా కనిపించినా ఇంతకంటే బీభత్సం మరోటి ఉండదు.

ఇది ఒక స్ర్తీకి వారి పిల్లలకు కుటుంబానికి సంబంధించిన విషాదం మాత్రమే కాదు. లోతుగా చూస్తే అందరం ఆలోచించాల్సి ఉన్న విషయం అని అర్థమవుతుంది.

సామాజిక కోణంలో చూసినపుడు ఏ బంధం అయినా నిలవాలంటే కొన్ని లక్షణాలుండాలి. మంచి కమ్యూనికేషన్ ఉండాలి.

కుటుంబం బందీఖానాగా మారకూడదనుకుంటే ముందుగా దాని చుట్టూ ఉన్న మాయను బద్దలు కొట్టాలి.

కానీ నాలుగు గోడల మధ్య ఊపిరాడని స్థితి వచ్చాక పరిష్కారం ఆ నాలుగు గోడల నుంచి బయటపడడమే. అందరూ కుటుంబాల్లోంచి బయటపడాలని కాదు. ఊపిరి ఆడని స్థితి వస్తే అక్కడే ఉండి ఊపిరి తీసుకునే బదులు బయటకొచ్చి బతికే మార్గం ఉంది అని చెప్పాల్సిన బాధ్యత, భరోసా ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద, బంధువుల మీద, స్నేహితుల మీద, మొత్తంగా మన సమాజం అంతటిమీదా ఉందా, లేదా అనేదే ఆలోచించుకోవాల్సి అంశం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)