You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కల్యాణ్ సింగ్: ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజస్థాన్ మాజీ గవర్నర్ కల్యాణ్ సింగ్ శనివారం రాత్రి మరణించారు.
తీవ్ర అనారోగ్యం పాలైన ఆయనను జులై 4న లఖ్‌నవూలోని సంజయ్ గాంధీ పీజీఐ ఆసుపత్రిలో చేర్పించారు.
సుదీర్ఘ కాలం పాటు అనారోగ్యంతో బాధపడిన ఆయన అవయవాలు వైఫల్యం కావడంతో మరణించారని వైద్యులు ధ్రువీకరించారు.
సీనియర్ బీజేపీ నాయకుడైన ఆయన రెండు సార్లు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెండుసార్లు పార్లమెంటుకు కూడా ఎన్నికయ్యారు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేశారు.
బాబ్రీ కేసులో ఆరోపణలు
బాబ్రీ కూల్చివేత సమయంలో కరసేవకులను కావాలనే పోలీసులు, ప్రభుత్వం అడ్డుకోలేదని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
మసీదు కూల్చివేతకు కుట్ర పన్నినట్లు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్న 13 మందిలో కల్యాణ్ సింగ్ కూడా ఒకరు.
ఆ తర్వాత కాలంలో ఆయన బీజేపీ నుంచి వేరుపడి, రాష్ట్రీయ క్రాంతి పార్టీని స్థాపించారు. కొంతకాలానికి మళ్లీ బీజేపీ గూటికే చేరారు.
హిందూ నాయకుడిగా పేరు
హిందూ నాయకుడిగా కల్యాణ్ సింగ్ తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఉత్తర్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ హవా నడుస్తున్నప్పుడే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు.
మొదట జన సంఘ్, ఆ తర్వాత జనతా పార్టీ, చివరగా బీజేపీలోనూ ఆయన పనిచేశారు.
1935 జనవరి 5న అలీగఢ్ జిల్లాలోని మధౌలీలో ఆయన జన్మించారు. చిన్నప్పుడే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)లో చేరారు.
ఉన్నత విద్యను అభ్యసించిన అనంతరం ఆయన టీచర్‌గా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్ శరణార్థులు రాకుండా సరిహద్దుల్లో కంచె వేసిన పాకిస్తాన్
- అష్రఫ్ ఘనీ: ‘1257 కోట్లతో పారిపోయాననడం అబద్ధం.. బూట్లు వేసుకునే సమయం కూడా ఇవ్వలేదు’
- తాలిబాన్‌లోని బలమైన నాయకులు ఎవరు? వారి పాత్ర ఏంటి?
- అమెరికా 'సైగన్ పతనం': 1975లో వియత్నాంలో జరిగిందే ఇప్పుడు కాబుల్‌లో పునరావృతం అయ్యిందా?
- ఆంధ్రప్రదేశ్: జీవోలను ఆన్లైన్లో పెట్టొద్దన్న ప్రభుత్వం, తాజా ఉత్తర్వులపై విమర్శలు
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)