సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రమాణ స్వీకారం

వీడియో క్యాప్షన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రమాణ స్వీకారం

జస్టిస్ నూతలపాటి వెంకట రమణ సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనతో ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

రాజ్యాంగంలోని 124వ అధికరణంలో 2వ క్లాజ్ కింద తనకు లభించిన అధికారాలను ఉపయోగిస్తూ రాష్ట్రపతి.. ఎన్‌వీ రమణను భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.

తెలుగువాడైన్ జస్టిస్ ఎన్‌వీ రమణ కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27న జన్మించారు.

1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్‌గా పనిచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)