You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మహారాష్ట్ర హోంమంత్రి పదవికి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా - కారణం ఇదే Newsreel
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు.
రాజీనామా లేఖను ఆయన ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు సమర్పించారని ఎన్‌సీపీ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.
ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ గతంలో అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు చేశారు.
వాటిపై విచారణ జరిపించాలంటూ జయ్‌శ్రీ పాటిల్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై విచారణ జరిపిన కోర్టు.. అవినీతి ఆరోపణలపై 15రోజుల్లో ప్రాథమిక విచారణ జరిపించాలని ఆదేశించింది.
కోర్టు ఆదేశాల తర్వాత అనిల్ దేశ్‌ముఖ్ పార్టీ నాయకులను కలిశారని, ఇలాంటి సమయంలో పదవిలో ఉండటం తనకు ఇష్టం లేదని వారికి చెప్పారని రాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నాయకుడు నవాజ్ మాలిక్ చెప్పినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది.
అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామాను ఆమోదించాలని పార్టీ తరఫున ముఖ్యమంత్రిని కోరినట్లు నవాజ్ మాలిక్ చెప్పారు.
అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా లేఖను సీఎం ఉద్ధవ్ ఠాక్రే గవర్నర్‌కు పంపించారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
అలాగే హోంశాఖ బాధ్యతలను ప్రస్తుతం దిలిప్ వాల్సే పాటిల్‌కు అప్పగిస్తున్నట్లు కూడా సీఎం సమాచారం ఇచ్చారని సీఎంవో చెప్పినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.
అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామాపై స్పందించిన వారిలో నటి కంగనా కూడా ఉంది.
ఇది ప్రారంభం మాత్రమేనని, ఏం జరుగుతుందో వేచి చూడాలని ట్వీట్ చేసింది.
ఇవి కూడా చదవండి:
- రూ. 2000 నోట్ల ముద్రణను రిజర్వు బ్యాంక్ ఆపేసింది... పెద్ద నోటు మళ్లీ రద్దవుతుందా?
- బ్యాంకుల సమ్మె ఎందుకు? మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వ బ్యాంకులను ఎందుకు ప్రైవేటీకరిస్తోంది?
- IPO అంటే ఏమిటి... దరఖాస్తు చేసిన వారందరికీ షేర్లు కేటాయిస్తారా? కేటాయించకపోతే ఏం చేయాలి?
- మ్యూచువల్ ఫండ్స్: మహిళలు పెట్టుబడి పెట్టేందుకు అద్భుతమైన మార్గం ఇదేనా?
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- మియన్మార్‌లో 'సరోంగ్ విప్లవం': మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)