Mukesh Ambani నివాసం సమీపంలో పేలుడు పదార్థాల కలకలం

ముంబయిలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలు కలిగిన స్కార్పియో కారు కలకలం రేపింది. ఆ వాహ‌‍నంలో 20 జిలెటిన్ స్టిక్స్ లభ్యమయ్యాయని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ తెలిపారు.

ఈ ప్రాంతం గావ్దేవీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ వాహనం గురించి సమాచారం అందగానే, భద్రతా సిబ్బంది వెళ్లారు.

తనిఖీలు నిర్వహించగా, ఆ వాహనంలో 20 జిలెటిన్ స్టిక్స్ దొరికాయని పోలీసులు చెప్పారు.

"ముంబయిలోని పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంటి నుంచి కొద్ది దూరంలో నిలిపి ఉన్న స్కార్పియో కారులో 20 జిలెటిన్ స్టిక్స్ పేలుడు పదార్థాలు కనుగొనబడ్డాయి. దీనిపై ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏం జరిగిందన్నది త్వరలో బయటకు వస్తుంది" హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ చెప్పారు.

ఈ కారును ఎవరు తీసుకొచ్చారు? ఎప్పటి నుంచి ఇది ఇక్కడ ఆగి ఉంది? అన్న విషయాలు తెలియాల్సి ఉంది.

ఈ ప్రాంతంలో ముంబయి పోలీసులు భద్రతను పెంచారు. బాంబులను నిర్వీర్యం చేసే నిపుణులు, సీనియర్ పోలీస్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ముంబయితోని అత్యంత ఖరీదైన ప్రాంతంలోని 27 అంతస్థుల భారీ భవంతిలో ముఖేశ్ కుటుంబం నివాసం ఉంటోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)