ముంబయి నగరానికి ఓ ఫొటోగ్రాఫర్ ప్రేమలేఖ

సూనీ తారాపోర్‌వాలా భారతదేశపు అగ్రస్థాయి ఫొటోగ్రాఫర్, స్క్రీన్‌రైటర్, ఫిల్మ్‌మేకర్.

మిసిసిపి మాసాలా, ద నేమ్‌సేక్, ఆస్కార్‌ అవార్డు కోసం నామినేట్ అయిన సలాం బాంబే వంటి సినిమాల రచయితగా ఆమె ప్రఖ్యాతి గాంచారు. జాతీయ అవార్డు గెలుచుకున్న లిటిల్ జిజో సినిమాకు ఆమె దర్శకత్వం వహించారు.

తను పెరిగిన ముంబయి నగరాన్ని 1977 నుంచీ ఆమె ఫొటోలు తీశారు.

నాటి వింతలతో పాటు రోజువారీ జీవన క్రమాన్ని నిక్షిప్తం చేసిన ఈ ఫొటోలు.. ఈ మహానగర సామాజిక చరిత్రకు గణనీయ తోడ్పాటునందిస్తాయి.

ప్రపంచంలో అత్యధిక జనాభా గల నగరాల్లో ఒకటైన ముంబయి నివాసిగా సామాజిక తరగతులు, వర్గాలకు అతీతంగా ఆ నగరంపై ఆమె ప్రేమపూరిత దృక్కోణాన్ని ఈ చిత్రాలు పట్టిచూపుతాయి.

ముంబయిలో జరుగనున్న ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనున్న ఆమె ఫొటోలు.. ఆ నగర వింతలు విశేషాలు, చిన్నారులు, వయోవృద్ధులు, నగర సంస్కృతి, రాజకీయాల చారిత్రక పత్రాల వంటివనడంలో సందేహం లేదు.

సూనీ తారాపోర్‌వాలా ఫొటో ప్రదర్శన ‘హోమ్ ఇన్ ద సిటీ’ అక్టోబర్ 13వ తేదీన ముంబయిలోని చెమోల్డ్ ప్రెస్కాట్ రోడ్‌లో ప్రారంభమవుతుంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)