ఇరాన్‌పై వరుస బాంబుదాడుల వెనుక ఉన్నది ఎవరు?

వీడియో క్యాప్షన్, ఇరాన్‌పై వరుస బాంబుదాడులు

గత కొద్ది వారాలుగా వరుసగా జరుగుతున్న బాంబు పేలుళ్లు ఇరాన్‌ను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ఇంధన కేంద్రాలు, న్యూక్లియర్ సైట్లను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరుగుతున్నాయి.

అణుపరీక్షలకు అత్యంత కీలకమైన నతాంజ్ అణుకేంద్రంపై పోయిన గురువారం జరిగిన దాడి అత్యంత ప్రమాదకరమైనది. దీని వెనుక ఇజ్రాయెల్ ఉన్నట్లుగా చాలా మంది భద్రతా నిపుణులు అనుమానిస్తున్నారు.

మరి ఇరాన్ అణ్వాయుధ తయారీపై దీని ప్రభావం ఎలా ఉండొచ్చు?

డోనల్డ్ ట్రంప్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చిన ఇరాన్‌కు నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు చాలా కీలకంగా మారనున్నాయి.

ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలకు ఈ దాడులు అద్దం పడుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఇక ఏం చేస్తారోనని అందరూ ఊపిరి బిగపట్టి చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)