ముంబయి, చెన్నై, కోల్‌కతా నగరాలు సముద్రంలో మునిగిపోబోతున్నాయా

వీడియో క్యాప్షన్, ప్రాణాలు తీస్తున్న వాతావరణ మార్పులు

భారత్‌లో ఏటా వచ్చే వరదలు వేలాది కుటుంబాలను నిరాశ్రయులను చేస్తుంటాయి.

వందలాది పశువులు మృత్యువాత పడుతుంటాయి.

తుపానులు, వరదలు వచ్చినప్పుడంతా ప్రజలు మూటాముల్లె మోసుకుంటూ సహాయ శిబిరాలకు వెళ్తుంటారు.

వాతావరణ మార్పుల కారణంగా ప్రకృతి విపత్తులు ఎక్కువవుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

మరోవైపు 2050 నాటికి ముంబై, చైన్నై, కోల్‌కతా నగరాలు సముద్రంలో మునిగిపోతాయా? అంటే అవుననే అంటోంది క్లైమేట్ సెంట్రల్ నివేదిక.

వాతావరణ మార్పులు భవిష్యత్తులో మనుషుల మధ్య ఓ కొత్త జాతివివక్షకు కారణమవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీబీసీ ప్రత్యేక యానిమేషన్ కథనాలు అందిస్తోంది. అందులో భాగంగా ఈ వీడియో కథనాలు చూడండి.

ప్రొడ్యూసర్: వంశీ చైతన్య

ఇలస్ట్రేషన్: గోపాల్ శూన్య్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)