పాకిస్తాన్: కరాచీలో ఇళ్లపై కూలిన విమానం...జనావాసాలు ధ్వంసం
పాకిస్తాన్ విమాన ప్రమాదంలో మొత్తం 97 మంది మృతిచెందినట్లు ఆ దేశంలోని సింధ్ ప్రావిన్స్ అధికారులు ధ్రువీకరించారు.
విమానంలో 8 మంది సిబ్బంది సహా మొత్తం 99 మంది ఉండగా ఇద్దరు సజీవంగా బయటపడ్డారు.
60 మృతదేహాలు జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్(జేపీఎంసీ), మిగతావి కరాచీ సివిల్ హాస్పిటల్(సీహెచ్‌కే)లో ఉన్నాయని పాకిస్తాన్ అధికారులు వెల్లడించారు.
మృతుల్లో 19 మందిని గుర్తించామని, మిగతవారిని గుర్తించే ప్రక్రియ సాగుతుందని తెలిపారు. ఈ ప్రమాదంలో 25 ఇళ్లు దెబ్బతిన్నాయి.
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం కరాచీ విమానాశ్రయానికి సమీపంలోని ఒక కాలనీ వద్ద శుక్రవారం కూలిపోయింది.
ఎలా కూలిపోయింది?
విమానం దిగే సమయంలో ల్యాండింగ్ గేర్ పనిచేయలేదని, దాంతో పైలట్ మరోసారి ప్రయత్నించేసరికి విమానం కూలిపోయిందని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ చైర్మన్ అర్షద్ మాలిక్ తెలిపారు.
విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు పైలట్ ట్రాఫిక్ కంట్రోల్‌కు చెప్పారన్నారాయన.సింధ్ ముఖ్యమంత్రి కరాచీ నగరంలోని అన్ని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు.
కరాచీ విమానాశ్రయం పాకిస్తాన్‌లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటి.
శిథిలాలను తొలగించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- నేపాల్ లిపులేఖ్ మ్యాప్ వివాదంపై మనీషా కోయిరాలా ట్వీట్‌కు సుష్మా స్వరాజ్ భర్త ఎలా సమాధానం ఇచ్చారు?
- చైనాతో సరిహద్దు.. 9.7 కోట్ల జనాభా.. 300 కేసులు, ఒక్క మరణం కూడా లేదు.. వియత్నాం కమ్యూనిస్టు ప్రభుత్వం విజేతగా ఎలా నిలిచింది?
- సైక్లోన్ ఆంఫన్: కోల్‌కతాలో విలయం సృష్టించిన తుపాను
- టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేయాలని ఎందుకు డిమాండ్లు వస్తున్నాయి? వివాదం ఏంటి?
- కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు.. నాలుగు దేశాల్లోనే అత్యధికం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)