మే 25 నుంచి విమాన సర్వీసుల పునరుద్ధరణ: కేంద్ర మంత్రి ప్రకటన

మే 25వ తేదీ నుంచి దేశీయ విమాన సర్వీసులు క్రమంగా పున:ప్రారంభమవుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.

కరోనావైరస్‌ను నియంత్రించటానికి తొలుత మార్చి 25న లాక్‌డౌన్ విధించినప్పటి నుంచీ దేశంలో అన్ని రవాణా సదుపాయాలతో పాటు విమాన సర్వీసులను నిలిపివేశారు.

మే 18వ తేదీ నుంచి నాలుగో విడత లాక్‌డౌన్‌లో అనేక సడలింపులు ఇచ్చినప్పటికీ విమాన సర్వీసులు మొదలు కాలేదు. ఈ సర్వీసులను మే 25వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి బుధవారం ట్విటర్‌లో తెలిపారు.

సర్వీసులను పున:ప్రారంభించటానికి సంసిద్ధం కావాలంటూ దేశంలోని అన్ని విమానాశ్రయాలు, విమనయాన సంస్థలకు సమాచారం అందిస్తున్నట్లు చెప్పారు.

ప్రయాణికుల కదలికలకు సంబంధించి ప్రామాణిక నిర్వహణా పద్ధతులు (ఎస్ఓపీల) వేరుగా జారీ చేస్తామన్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)