You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హైదరాబాద్ 'ఎన్‌కౌంటర్' మృతదేహాలను శుక్రవారం వరకు భద్రపరచండి: తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య చేసిన నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.
నిందితుల మృతదేహాలను శుక్రవారం వరకు గాంధీ ఆస్పత్రిలో భద్రపరచాలని ఆదేశించింది.
బుధవారం సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ కేసులో విచారణకు సీనియర్ అడ్వొకేట్ ప్రకాశ్ రెడ్డిని అమికస్ క్యూరీ (మధ్యవర్తి)గా హైకోర్టు నియమించింది.
మరోవైపు, 'దిశ' కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ఈ కేసును రిజిస్టర్ చేసి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, విచారణ జరపాలని సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు అంగీకరించిందని రిపోర్టర్ సుచిత్ర మొహంతీ తెలిపారు.
‘‘ఈనెల 11వ తేదీ బుధవారం ఈ పిటిషన్‌పై దృష్టిసారిస్తాం’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే అన్నారని వివరించారు.
ఈ పిటిషన్‌ను త్వరితగతిన విచారణకు స్వీకరించాలని న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్‌లు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి:
- జస్టిస్ సుదర్శన రెడ్డి: ఎంపీలు, ఎమ్మెల్యేలపైనా రేప్ కేసులున్నాయి, వారిని ఎన్‌కౌంటర్ చేయడం సాధ్యమేనా?
- హైదరాబాద్ ఎన్‌కౌంటర్: ‘పోలీసుల కథనం చిన్నపిల్లలు కూడా నమ్మేలా లేదు’
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన బారత్
- 'గోల్డెన్ పాస్‌పోర్టుల' కోసం సంపన్నులంతా ఎందుకు ఎగబడుతున్నారు?
- ప్రపంచంలోనే అతిపెద్ద జంతు ప్రదర్శనశాల ప్రారంభం...
- దిల్లీ అగ్నిప్రమాదం: ‘సమయానికి వెళ్లా, ముగ్గుర్ని కాపాడా.. కానీ, సోదరుడిని కాపాడుకోలేకపోయా’
- కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు: బీజేపీకి 12 స్థానాల్లో ఆధిక్యం
- 'ఒక ఎంపీ నన్ను రేప్ చేశాడు.. కానీ, నా తండ్రి ఎవరికీ చెప్పకుండా దాచేయమన్నాడు’ - మాజీ ప్రధాని కుమార్తె
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)