You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రజినీకాంత్: 'నాకు కాషాయ రంగు పులమాలనుకున్నారు... నేను వారి వలలో పడను'
తనకు కాషాయ రంగు పులమడానికి కొందరు నిరంతరం ప్రయత్నిస్తున్నారని సినీ నటుడు రజినీకాంత్ అన్నారు.
చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల తమిళ ప్రాచీన కవి తిరువళ్లువర్‌ను కాషాయీకరణ చేసినట్లు, నన్ను కూడా బీజేపీ మద్దతుదారుగా చిత్రించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
"తిరువళ్లువర్, నేను ఇద్దరం వారి వలలో చిక్కుకోం'' అని పేర్కొన్నారు. బీజేపీలో చేరాలని ఆ పార్టీ వాళ్లెవరూ తనను కోరలేదని రజినీ తెలిపారు.
అయితే, మాజీ మంత్రి రాధాకృష్ణన్ సహా రాష్ట్రానికి చెందిన పలువురు బీజేపీ నేతలు రజినీకాంత్ తమ పార్టీలోకి రావాలని ఎన్నో ఏళ్ల నుంచి కోరుతున్నారు.
2016లో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నోట్లరద్దు చర్యను గతంలో స్వాగతించిన రజినీకాంత్ ఇప్పటికీ తన మాటలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.
అయోధ్య తీర్పుపై వ్యాఖ్యానిస్తూ ఎలాంటి తీర్పు వచ్చినా ప్రజలు శాంతియుతంగా ఉండాలని కోరారు.
క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే వరకు నటనను కొనసాగిస్తానని చెప్పారు. తమిళనాడు రాజకీయాల్లో నాయకత్వ శూన్యత ఉందని పేర్కొన్నారు.
నుదిటిపై విభూతి, మెడలో రుద్రాక్ష కనిపించేలా ప్రాచీన కవి తిరువళ్లువర్ ఫొటోను ఇటీవల తమిళనాడు బీజేపీ శాఖ ట్విటర్‌లో పెట్టింది.
తిరువళ్లువర్‌ను హిందూ కవిగా చిత్రీకరించడానికి బీజేపీ ప్రయత్నించిందని దీనిపై పలు రాజకీయ పార్టీలు, సంస్థలు మండిపడ్డాయి.
ఇవి కూడా చదవండి:
- తిరువళ్లువర్ విభూతిపై తమిళనాడులో వివాదం ఎందుకు రేగింది?
- 'భూ వివాదంతో తహశీల్దారు విజయ రెడ్డిని సజీవ దహనం చేసిన సురేశ్’
- పిడికెడు మిరపకాయలు, గుప్పెడు అన్నం... అయిదేళ్లు ఆదే ఆమె ఆహారం
- అసలైన సూపర్ మ్యాన్, థోర్, వండర్ ఉమన్ ఎవరు.. ఆ సూపర్ హీరోలు ఎక్కడుండేవారు
- అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఆల్‌టైమ్ రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే
- భూపత్ డాకూ: భారత్ నుంచి పారిపోయిన ఈ దోపిడీ దొంగకు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది
- రక్తం చిందినట్టు ఎరుపు రంగులోకి మారిపోయిన ఆకాశం.. ‘ఇది అంగారక గ్రహం కాదు.. మా ఊరే’
- వేముగోడులో రజకులను ఎందుకు వెలివేశారు?
- టర్కీ - సిరియా సంఘర్షణ: కుర్దు ఫైటర్ల మీద క్రూరమైన యుద్ధ నేరాలు... వెలుగులోకి దారుణమైన వీడియోలు
- మెక్ డోనల్డ్స్ బర్గర్లు: పదేళ్లైనా పాడవలేదు.. బూజు పట్టలేదు.. ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)