You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హైదరాబాద్‌లోని షైన్ పిల్లల ఆస్పత్రిలో అగ్నిప్రమాదం, ఒక శిశువు మృతి
హైదరాబాద్ ఎల్బీ నగర్ చౌరస్తాలోని షైన్ పిల్లల వైద్యశాలలో అగ్నిప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులకు తీవ్ర గాయాలు కాగా అందులో ఒక చిన్నారి మృతి చెందింది.
దీంతో, ఆస్పత్రి వద్ద తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోచేశారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు స్పష్టం చేశారు.
హాస్పటల్ భవనం అద్దాలు ధ్వంసం చేసి అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు.
"రాత్రి 2.30 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్య్కూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ప్రాథమిక విచారణ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తీవ్ర గాయాలపాలైన చిన్నారులు ప్రస్తుతం ఇతర ఆస్పత్రులలోని ఎమర్జెన్సీ విభాగాల్లో చికిత్స పొందుతున్నారు" అని డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు.
అగ్ని ప్రమాదం జరిగినట్లు రాత్రి 2.59 గంటలకు తమకు ఫోన్ వచ్చిందిన ఫైర్ సిబ్బంది తెలిపారు. 3.06 గంటలకు తాము ఘటనా స్థలానికి చేరుకున్నామన్నారు.
"భవనం మూడో అంతస్తులో ప్రమాదం సంభవించింది. మా సిబ్బంది వెంటనే మూడో అంతస్తుకు చేరుకున్నారు. కానీ అప్పటికే అక్కడి గది అంతా పొగతో నిండిపోయింది. ఏం కనిపించలేదు. అద్దాలు పగలగొట్టి పొగను ముందు బయటకు పంపించేందుకు ప్రయత్నించారు. ఈలోగా మిగిలిన సిబ్బంది మంటలు చెలరేగిన ప్రదేశాన్ని గుర్తించారు. ఓ మూలనున్న ఫ్రిడ్జ్ సమీపంలోనుంచి ఎగసి పడుతున్న మంటలను అదుపుచేశారు" అని అగ్నిమాపక విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.
నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో ఈ ప్రమాదం జరగడంతో అందులోని ఇంక్యుబేటర్లలో చికిత్స పొందుతున్న ఐదుగురు శిశువులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఆస్పత్రికి చేరేలోపే ఆస్పత్రి సిబ్బంది ఈ పిల్లలను ఆ గది నుంచి తరలించారు.
ఇదే అంతస్తులోని ఇతర గదుల్లో దాదాపు మరో 45 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. వారందరినీ షైన్ హాస్పటల్ నుంచి ఇతర ఆస్పత్రులకు సిబ్బంది, పోలీసులు తరలించారు.
తీవ్ర అస్వస్థతకు గురైన ఐదుగురు పిల్లల్లో మూడు నెలల బాలుడు మృతి చెందాడు.
ఆస్పత్రిలోని ఫైర్ ఫైటింగ్ వ్యవస్థలు పనిచేయడం లేదని, నీటి పైపులను ఉపయోగించేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించగా అవి కూడా పనిచేయలేదని ఫైర్ సిబ్బంది తెలిపారు.
ఆస్పత్రిని సీజ్ చేసి, పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి.
- భారత సైన్యం దాడిలో ‘ఉగ్రవాదులు’, పాక్ సైనికులు మృతి: ఇండియన్ ఆర్మీ చీఫ్ ప్రకటన
- 'పప్పు' చేసిన అద్భుతం... అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డఫ్లో జంటకు నోబెల్
- కల్నల్ గడాఫీ: ఒకప్పటి అమెరికా పవర్ఫుల్ మహిళ వెంటపడిన నియంత
- చంద్రుడి మీదకు మళ్లీ మనిషిని పంపించటం కోసం కొత్త స్పేస్‌సూట్ ఆవిష్కరణ.. ప్రత్యేకతలివే
- 'నేను లైంగిక దాడి బాధితురాలిని, నా పేరు ప్రపంచమంతా తెలియాలి'
- నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)