You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
టీడీపీ నేత, చిత్తూరు మాజీ ఎంపీ డాక్టర్ ఎన్ శివప్రసాద్ కన్నుమూత
చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత డాక్టర్ నారమల్లి శివ ప్రసాద్ తుదిశ్వాస విడిచారు.
కొంతకాలంగా మూత్ర పిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న శివ ప్రసాద్‌కు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈరోజు మధ్నాహ్నం 2.10 గంటలకు శివప్రసాద్ మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి.
నారమల్లి శివ ప్రసాద్ 1999 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. 1999 నుంచి 2001 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో పనిచేశారు.
2009, 2014 ఎన్నికల్లో చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓడిపోయారు.
గతంలో నటుడిగానూ ఆయన తెలుగు ప్రజలకు సుపరిచితుడు. ఆయన ఎంపీగా ఉన్న సమయంలో అనేక సమస్యలపై తనదైన శైలిలో, విభిన్నమైన వేషధారణలతో పార్లమెంటు వద్ద నిరసన తెలిపేవారు.
చిత్తూరు జిల్లాలోని పూటిపల్లిలో 1951 జులై 11న శివప్రసాద్ జన్మించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు.
రంగస్థల నటుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ నటుడిగా, దర్శకుడిగానూ పనిచేశారు. ఖైదీ, జై చిరంజీవ, యముడికి మొగుడు, డేంజర్, ఆటాడిస్తా లాంటి అనేక సినిమాల్లో ఆయన విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు.
ప్రేమ తపస్సు, టోపి రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరొకో అనే నాలుగు సినిమాలకు దర్శకుడిగానూ పనిచేశారు.
"తెలుగుదేశం పార్టీకి తీరని లోటు"
శివప్రసాద్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రజల మనసుల్లో శివప్రసాద్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి.
- కోడెల శివప్రసాద్ 'ఆత్మహత్య'.. ప్రభుత్వ వేధింపులే కారణమన్న చంద్రబాబు
- #HowdyModi: అమెరికాలో మోదీ కార్యక్రమానికి రానున్న ట్రంప్
- కశ్మీర్ కోసం భారత్‌తో యుద్ధం రావచ్చు: ఇమ్రాన్ ఖాన్
- మోదీ వల్ల పాకిస్తాన్లో కశ్మీర్‌పై చర్చ స్వరూపమే మారిపోయిందా...
- రెండేళ్ల చిన్నారి మీద అత్యాచారం... కోర్టులో సాక్ష్యం చెప్పిన పసిపాప
- ‘ఉద్యోగాల లోటు లేదు, ఉత్తర భారతీయుల్లో వాటికి అర్హులు లేరు’ - కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి... డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు... ఆ తర్వాత ఏం జరిగింది?
- ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన నగరం కారకస్‌లో రాత్రి జీవితం ఎలా ఉంటుంది?
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లు ఎవరు... ఇన్నేళ్ళుగా వారితో యుద్ధం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)