You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
క్యామ్ స్కానర్ యాప్ వాడుతున్నారా... తస్మాత్ జాగ్రత్త
సర్టిఫికెట్స్, డాక్యుమెంట్స్ కాపీలను ఎవరికైనా పంపాలంటే ఒకప్పుడు ఫ్యాక్స్ చేయాల్సి వచ్చేది. కంప్యూటర్ స్కానర్‌లు వచ్చాక ఈ పని కొంచెం తేలికైనా ఖర్చూ, కాస్త శ్రమా తప్పేవి కావు.
క్యామ్ స్కానర్ యాప్ రాకతో ఈ కష్టాలు దూరమైపోయాయి. పైసా వ్యయం లేకుండా, డాక్యుమెంట్స్‌ను ఫోన్‌తోనే ఫొటో తీసి, పీడీఎఫ్‌లుగా మార్చుకునే సదుపాయం వచ్చింది.
అయితే, ఎంతో ఉపయోగకరమైన ఈ యాప్‌తో ఇప్పుడు ఓ ముప్పు వచ్చిందని సైబర్ భద్రత పరిశోధకులు చెబుతున్నారు.
క్యామ్ స్కానర్ యాప్ తాజా వెర్షన్‌లో యాడ్‌లకు సంబంధించిన కోడ్‌లో మాల్‌వేర్ ఉన్నట్లు కాస్పర్స్కీ ల్యాబ్ అనే సైబర్ భద్రత సంస్థకు చెందిన పరిశోధకులు వెల్లడించారు.
ఈ మాల్‌వేర్ వల్ల వినియోదారుల లాగిన్ క్రెడెన్సియల్స్ బహిర్గతమయ్యే ముప్పు ఉందని వారు హెచ్చరించారు.
క్యామ్ స్కానర్ ప్రమాణాలపై సందేహాలు లేవని, వినియోగదారులు దాన్ని విశ్వసించవచ్చని పరిశోధకులు చెప్పారు. యాప్‌లో యాడ్స్‌కు సంబంధించిన థర్డ్ పార్టీ కోడ్‌లోనే మాల్‌వేర్ ఉందని వివరించారు.
క్యామ్ స్కానర్ ఉచిత వెర్షన్ ప్రస్తుతానికి ప్లే స్టోర్‌లో అందుబాటులో లేదు.
మాల్‌వేర్ కోడ్‌ను తొలగించి, కొత్త వెర్షన్‌ను విడుదల చేస్తున్నట్లు క్యామ్ స్కానర్ ప్రకటించింది.
యాప్స్ ఆటోమెటిక్‌గా అప్‌డేట్ అయ్యేలా సెట్టింగ్ పెట్టుకుని ఉంటే, మాల్‌వేర్ ఉన్న క్యామ్ స్కానర్ యాప్ మీ ఫోన్‌లో దానికదే ఇన్‌స్టాల్ అయ్యుండొచ్చు.
అనుమానాలుంటే, ఆ యాప్‌ను ప్రస్తుతానికి అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవడం ఉత్తమమని హాకర్ హౌస్ అనే సైబర్ భద్రత సంస్థకు చెందిన మాథ్యూ హికీ సూచించారు.
''సగటు వినియోగదారులు తరచుగా వినియోగించే యాప్స్ 40 వరకూ ఉంటాయి. అవసరం లేకున్నా, ఫోన్‌లో ఉండిపోయిన యాప్స్‌ను తొలగించండి. బ్యాంకింగ్ యాప్స్ వాడుతున్నట్లైతే, యాంటీ వైరస్ యాప్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోండి'' అని హికీ అన్నారు.
ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌లోని యాప్స్‌లో మాల్‌వేర్ బయటపడుతున్న ఉదంతాలు ఇటీవల పెరిగాయని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్ పేరేంటో తెలుసా...
- విక్రమ్ సారాభాయ్: ఈ శాస్త్రవేత్త అణుబాంబును వ్యతిరేకించారా
- అంతరిక్షం నుంచి అందరికీ ఇంటర్నెట్.. కొత్త ఉద్యోగాలు వస్తాయ్
- పెరూలో బయటపడ్డ 500 ఏళ్లనాటి మృతదేహాలు.. ‘దేవతలను సంతృప్తి’ పరచడానికి 227 మంది పిల్లల సామూహిక బలి
- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టాడు.. డెబ్బై ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
- ‘మా నాన్న ఒక గ్యాంగ్‌స్టర్... నా మూలాలు దాచేందుకు నా ముక్కునే మార్చేశాడు’
- భారత 'రూపాయి' విలువ బంగ్లాదేశ్ 'టకా' కంటే తగ్గిందా? - Fact Check
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)