You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కశ్మీర్: తిట్రినోట్ క్రాసింగ్ పాయింట్ వద్ద కలుసుకున్న కశ్మీరీ కుటుంబాలు
జమ్ము- కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ సమీపంలోని తిట్రినోట్ దగ్గర ఒక క్రాసింగ్ పాయింట్ ఉంది. దేశవిభజన సమయంలో విడిపోయిన కశ్మీరీ ముస్లిం కుటుంబాలను ఇది కలుపుతూ ఉంటుంది.
కశ్మీర్ లోయలో ఉద్రిక్తతల నేపథ్యంలో మూసివేసిన ఈ ప్రాంతాన్ని ఇటీవల తెరిచారు. దాంతో భారత పాలిత కశ్మీర్‌లోని కొన్ని కుటుంబాలు పాక్ పాలిత కశ్మీర్‌లో ఉన్న తమవారిని కలుసుకోడానికి తిట్రినోట్ వచ్చాయి.
అక్కడికి వచ్చినవారిని పలకరించిన బీబీసీ ప్రతినిధి రిఫత్ ఉల్లాహ్ అక్కడి పరిస్థితిని చిత్రీకరించారు.
చాలా రోజుల తర్వాత అక్కడికి వచ్చిన ఖ్వాజీ జమాలుద్దీన్ సంతోషం వ్యక్తం చేశారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లోయలో పరిస్థితులను వివరించారు.
అక్కడకు వచ్చిన ఓ వృద్ధురాలు తన బంధువులను కలిసినందుకు సంతోషించారు.
మూడు వారాల నుంచి తిట్రినోట్‌లో స్కూళ్లు మూసివేశారు. చాలా రోజున తర్వాత ఈ క్రాసింగ్ పాయింట్‌ను తెరవడంతో స్థానికులు సంతోషపడుతున్నారని బీబీసీ ప్రతినిధి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- వైరల్ ఫొటో: మొదటి రోజు స్కూల్‌కు వెళ్తున్నప్పుడు అలా... వచ్చేటప్పుడు ఇలా..
- నిచ్చెనలో తల ఇరుక్కుపోయి అయిదు రోజులు అలాగే ఉన్నాడు...
- ఈ దేశాలు రాజధాని నగరాలను ఎందుకు మార్చాయి?
- ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ల వివాదం... ఆ కెమేరాల వాడకంలోని నిబంధనలేంటి?
- కశ్మీర్: భారత్-పాక్ సరిహద్దు వెంబడి శత్రువుల తుపాకీ నీడలో దశాబ్దాలుగా పహారా
- ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణతో నిరుద్యోగం మరింత పెరుగుతుందా
- అంతరిక్షం నుంచి అందరికీ ఇంటర్నెట్.. కొత్త ఉద్యోగాలు వస్తాయ్
- మీ చేతిలోని స్మార్ట్ ఫోనే మీకు శత్రువుగా మారితే...
- "డబ్బులిచ్చి ఉద్యోగులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు" - అమెజాన్‌పై ట్విటర్‌లో విమర్శలు
- చంద్రుడిపై దిగడానికి అపోలో మిషన్‌కు 4 రోజులు పడితే, చంద్రయాన్-2కు 48 రోజులెందుకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)